Boy fell and Died in Sump : హైదారాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటి ముందున్న సంపులో పడిపోయి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒడిషాకు చెందిన అమర్‌దాస్, ఎమిన్‌దాస్ దంపతులు గత పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. నగర శివారు గుండ్లపోచంపల్లిలోని ఎస్సీ కాలనీలో అద్దెకు నివాసం ఉంటున్నారు. రోజు కూలీల్లా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా ఉదయం ఎమిన్‌దాస్ పనికి వెళ్లింది.
అమర్‌దాస్‌తో పాటు ఇంట్లో తన పది సంవత్సరాల పెద్దకొడుకు, రెండేళ్ల కృష్ణదాస్ ఉన్నారు. పెద్దకొడుక్కు జ్వరం రాగా పడుకొని ఉండగా మధ్యాహ్నం సమయంలో అమర్‌దాస్ మద్యం సేవించేందుకు బయటకు వెళ్లాడు. చిన్న కొడుకు కృష్ణదాస్ ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న సంపులో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవటంతో చిన్నారి మృతి చెందాడని స్థానిక ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.
తిరిగొచ్చిన అమర్‌దాస్ సంపులో తేలి నిస్తేజంగా పడి ఉన్న కొడుకును చూసి బోరున విలపించాడు. స్థానికుల సహాయంతో బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Kangana Ranaut: మహేశ్ బాబు చెప్పింది నిజమే.. కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు: కంగనా రనౌత్
Also Read : Sunny Leone Birthday: సన్నీ లియోనీ బర్త్ డే స్పెషల్.. సన్నీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook