MLC Kavitha Slams Congress: కాంగ్రెస్‌ పార్టీపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు, సూటి ప్రశ్నలు

MLC Kavitha Slams Congress Party: మహిళా రిజర్వేషన్ బిల్లు గత 20 ఏళ్లుగా ఆమోదం పొందనప్పటికీ గత 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

Written by - Pavan | Last Updated : Sep 16, 2023, 07:16 AM IST
MLC Kavitha Slams Congress: కాంగ్రెస్‌ పార్టీపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు, సూటి ప్రశ్నలు

MLC Kavitha Slams Congress Party: మహిళా రిజర్వేషన్ బిల్లు గత 20 ఏళ్లుగా ఆమోదం పొందనప్పటికీ గత 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ఈ బిల్లును పాస్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని అడిగారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చి నిన్న నాటి నుంచి ఇప్పటివరకు కూడా మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చలేదని ధ్వజమెత్తారు. ఏ రకంగా చూసినా మహిళా బిల్లు కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.

మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. శుక్రవారం రోజున కూడా మరోసారి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేసిందని, సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారని చెప్పారు. తాను కూడా తన స్థాయిలో రకరకాల ఉద్యమాలు చేశానని, ఇతర పార్టీలతో కలిసి కూడా ఉద్యమాలు చేపట్టానని అన్నారు. 

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ , కేసి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన నాయకులను ఈడీ పిలిపించి విచారించిందని, మరి గత ఏడాదిన్నర కాలంగా ఈ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిజెపికి మధ్య అవగాహన కుదిరినందుని కాంగ్రెస్ నాయకులను ఈడి విచారణకు పిలవడం లేదా అని అనుమానం వ్యక్తం చేశారు.

రూ. 5 వేల కోట్ల మేర అవకతవకలు జరగాయన్న ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఉన్న కేసుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. బిజెపికి కాంగ్రెస్‌కి మధ్య ఉన్న అవగాహన ఏమిటని అడిగారు. "కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటూ మరో రాష్ట్రంలో అదే కమ్యూనిస్టులతో కొట్లాట పెట్టుకుంటుంది. ఒక దగ్గర ఆమాద్మీ పార్టీతో కొట్లాడుతారు మరొక దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఇలా బహుళ రాష్ట్రాల్లో బహుళ విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోంది" అని కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. 

ఇది కూడా చదవండి :  Palamuru Project: ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పాలమూరు ప్రాజెక్ట్

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో  ఆదానికి రెడ్ కార్పెట్ వేసి  స్వాగతం పలుకుతూ.... ఇతర రాష్ట్రాల్లోనేమో ఆదానిని వ్యతిరేకిస్తున్నారని ఎండగట్టారు. ఈ మోసపూరితమైన వైఖరి, ద్వంద్వ విధానాల గురించి ప్రజలకు అర్థమైందని స్పష్టం చేశారు. రాజకీయ టూరిస్టులను తాము స్వాగతిస్తామని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్నా రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి స్వాగతం తెలియజేస్తున్నానని కవిత ఎద్దేవా చేశారు. వచ్చి హైదరాబాది బిర్యానీ తిని హ్యాపీగా వెళ్ళిపోవాలని , కానీ ద్వంద్వ, మోసపూరిత వైఖరి తోటి మరొకసారి తెలంగాణ ప్రజలను దేశ ప్రజలను మధ్యపెట్టవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు.

ఇది కూడా చదవండి :  MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో ఊరట.. మరో పది రోజులు వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News