TDP fan cut his tongue for tdp leader chandrababu naidu: రెండు తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల అరెంజ్ మెంట్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది తమ ఈవీఎంలను, ఓటింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రానికి చేరిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సోంత ఊర్లకు వెళ్లేందుకు క్యూలు కట్టారు. బస్సులు, రైల్వేలు, విమానాలు, ప్రైవేటు వాహానాలలో ప్రయాణికులు భారీ ఎత్తున వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారాల పర్వానికి నిన్న తెరపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రలోభాల పర్వం మొదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలలో డబ్బులను కొందరు నేతలు పంచుతున్నట్లు కూడా వార్తలలో వస్తున్నాయి. ఓటుకు మూడు వేలు, ఐదువేల చొప్పున డబ్బులు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
ఎక్కడ కూడా డబ్బులు, మద్యం పంపిణి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదనపు బలగాలను రప్పించారు. ఎప్పటికప్పుడు స్థానిక అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుని, అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక వ్యక్తి తన నాలుకను కోసుకున్నాడు. చెవల మహేశ్ అనే వ్యక్తి శ్రీనగర కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని తన నాలుకను కోసుకున్నాడు. దీంతో అతని షర్ట్ అంతా రక్తంతో నిండిపొయింది. అతనిజేబులో ఉన్న లేఖను తీసి ,చూడగా.. తన పేరు చెవల మహేష్ అని, తనది వెస్ట్ గోదావరి జిల్లా గూటల గ్రామంగా చెప్పుకున్నాడు.
ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి, సీఎం అవ్వాలని, పవన్ , లోకేష్ గెలవాలని తన నాలుకను కోసుకుంటున్నట్లు రాసుకొచ్చాడు. గతంలో.. వైఎస్సార్, జగన్ కూడా సీఎం కావాలని తన నాలుకను ఇక్కడే కోసుకున్నానని, అదే విధంగా వారు గెలించారని, ఈసారి మాత్రం చంద్రబాబు కూటమి గెలిచి, చంద్రబాబుగా సీఎం అవ్వాలనేది తన కోరిక అంటూ రాసుకొచ్చాడు. ఈ క్రమంలో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏపీలో నువ్వా నేనా అన్న విధంగా ప్రచారం జరిగింది. తన పాలనలో ప్రజలకు చేసిన మంచిని, పథకాలను, లబ్ధి పొందిన విధానం చెప్పి సీఎం జగన్ తనకు మరొసారి అవకాశం ఇవ్వాలని ప్రచారం నిర్వహించారు.
మరోవైపు జనసేన,టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి తమకు ఈసారి ఎన్నికలలో గెలిపించాలని ప్రచారం చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ నుంచి షర్మిల కూడా ఎన్నికల బరిలో నిలబడి, వైఎస్ జగన్ ను అనేక వేదికల మీద ఏకీపారేశారు. సీఎంగా జగన్ ఏపీకి చేసిందేమి లేదంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో నేతలంతా హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికలలో ప్రజలు ఎవరికి ఓటువేస్తారో, తమ సీఎంగా ఎవరికి చాన్స్ ఇస్తారో తెలియడానికి మరికొన్ని రోజులు మాత్రం వేచిచూడాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter