Cm Kcr Fire on Bjp: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం సేకరణ, పంటల సాగు, పెట్రో ధరలపై సీఎం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్(CM KCR) నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని విమర్శించారు. అసలు ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పింది కేంద్ర ప్రభుత్వమేనని, ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) రైతులను ధాన్యం పండించమని చెప్పడం డ్రామా కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు.
పెట్రోల్(Petrol), డీజిల్(Diesel)పై కేంద్రం అబద్ధాలు చెబుతోందని...రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ సెస్ పెంచిందని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో వ్యాట్(VAT) ఒక్క రూపాయి కూడా పెంచేది లేదన్నారు. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్(Cess)ను రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Also read: Komatireddy Venkat Reddy: అక్కడి నుంచి ఉద్యమం మొదలుపెడుతా... రేపటి నుంచి నేనేంటో చూపిస్తా
''కేసీఆర్‌ను జైల్లో పెడతామని బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ము భాజపా నేతకు ఉందా? కేసీఆర్‌ని టచ్ చేసి చూడు.. బతికి బట్టకడతావా? మీరు ధర్నాలు చేయడం కాదు.. రేపట్నుంచి మేం ధర్నాలు చేస్తాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నా చేస్తాం. సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తాం'' అని కేసీఆర్ అన్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. రైతులు(Farmers) వరి పంటనే వేయండి. ప్రభుత్వం మెడలు వంచి వరి పంట కొనుగోలు చేయిస్తాం అని చెబుతున్నారు. ఎవరి మెడలు వంచి కొనుగోలు చేయిస్తారు. కేంద్రం మెడలు వంచుతారా? ఓ వైపు కేంద్రం మేము ధాన్యం కొనుగోలు చేయమని కండీషన్ పెడుతుంటే.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook