హైదరాబాద్: తెలంగాణ వీఆర్ఏ (VRA In Telangana)లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పే స్కేల్ అమలులో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఏలు ఉద్యోగం తీసుకోవచ్చునని, లేకపోతే వారి కుటుంబంలోని వారసులకు అయినా ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర శాసనసభలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చ సందర్బంగా ఈ విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. TS POLYCET Result 2020: తెలంగాణ పాలిసెట్ 2020 ఫలితాలు విడుదల
వీఆర్ఓ వ్యవస్థ రద్దు అవుతున్న తరుణంలో ఇప్పటివరకు ఉన్న వీఆర్ఏల పరిస్థితి ఏంటని సత్తుపల్లి ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు. వీఆర్ఏలలో ఎక్కువ మంది బలహీన వర్గాల నుంచి వచ్చినవారే ఉన్నారని చెప్పారు. తరతరాలుగా ఎన్నో కోణాల్లో వారు సేవలందించారని కొనియాడారు. బందోబస్తులు, జమాబంధీ, నీళ్ల విషయం అయితేం.. ప్రతి విషయంలో ఎంతో శ్రమించారు, గ్రామానికి నిజమైన సేవకులుగా నిలిచారని, సమాజం సైతం వారిపట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. Telangana: కొత్తగా 2,426 కరోనా కేసులు
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే వారి జీతం రూ.10 వేలు చేశామని గుర్తు చేశారు. నూతన రెవెన్యూ విధానంలో ప్రస్తుతం కొనసాగుతున్న వీఆర్ఏలు కొనసాగవచ్చు.. లేని పక్షంలో వారి వారసులకు అడిగితే అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. Shivani Narayanan Photos: ట్రెడీషన్, మోడ్రన్ ఏదైనా సరే..
Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR