Telangana Politics: రేవంత్‌ రెడ్డి కోరిక.. కేసీఆర్ తీరుస్తారా?

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా..! ఆ విషయంలో మాత్రం తన కోరిక నెరవేరడం లేదని నిరాశ పడుతున్నారా..! మరి డిసెంబర్‌ తొమ్మిదో తేదీన రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా..! లేదంటే ఆయన కల కలగానే మిగిలిపోతుందా..! ఇంతకీ రేవంత్ రెడ్డి ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు..!

Written by - G Shekhar | Last Updated : Dec 7, 2024, 10:00 PM IST
Telangana Politics: రేవంత్‌ రెడ్డి కోరిక.. కేసీఆర్ తీరుస్తారా?

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌ ఏర్పడి ఏడాది అవుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్‌ రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని ఊరూరా సంబురాలు జరుపుతోంది. అటు రేవంత్‌ రెడ్డి కూడా తన ముఖ్యమంత్రి కల నెరవేరడంతో ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. కానీ.. ఓ విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఎన్నిసార్లు పిలిచినా అసెంబ్లీకి రావడం లేదని తీవ్ర నిరాశకు గురవుతున్నారట.. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలకు అయినా కేసీఆర్‌ వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారట.. కేసీఆర్‌ చేత ముఖ్యమంత్రి గారు అని అనిపించుకోవాలని భావిస్తున్నారట.. అయితే ఈసారైనా సీఎం రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా.. లేదంటే కొన్నాళ్లు ఎదురుచూడాల్సిందేనా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రెండోసారి అసెంబ్లీ సమావేశాలు మరో రెండురోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరైనప్పటికీ సభలో మాత్రం ఒక్కమాట మాట్లాడలేదు. కేవలం మీడియా పాయింట్‌లో రెండు నిమిషాలు మాడ్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయిన కేసీఆర్‌.. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎవరైనా కేసీఆర్‌ను కలవాలని అనుకుంటే ఫామ్‌హౌస్‌కే వెళ్తున్నారు. కలిసి మాట్లాడి వస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్యకలపాలన్నీ ఫామ్‌హౌస్‌ కేంద్రంగానే నడుస్తున్నాయి. అయితే ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు షురూ కానుండటంతో.. కేసీఆర్ వస్తారా లేదా అనేది మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది.

అయితే కొద్దిరోజులుగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్‌కు మరోసారి ఆహ్వానం పంపించారు. అధికారం లో ఉండగా ఎలాగూ సచివాలయానికి రాలేదు.. ప్రజలను కలిసేంందుకు ఇష్టపడలేదు.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లారు. ఇప్పుడైనా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకున్నారు. అయితే కేసీఆర్‌కు ఎదురుపడి ముఖ్యమంత్రి గారు అని అనిపించుకోవాలని ఊవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో కేటీఆర్‌, హరీశ్ రావుకు సభలో విమర్శిస్తున్నా.. కేసీఆర్‌ సభలో లేడనే అసంతృప్తి రేవంత్‌ రెడ్డిలో ఎక్కువగా ఉందట. అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ను ఎదుర్కొవాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ను ప్రత్యక్షంగా ఆరోపించే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాలేదు. అందుకే ఈసారైనా కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి బలంగా కోరుకుంటున్నారట. రేవంత్ రెడ్డి కోరిక ఇలా ఉంటే.. గులాబీ బాస్‌ ఆలోచన మరోలా ఉందట.. అసెంబ్లీకి వెళ్లి అవమానాలు ఎదుర్కొవడం అవసరమా అని కేసీఆర్‌ లెక్కలు వేసుకుంటున్నార.. ఒకవేళ అసెంబ్లీకి వెళ్లాక మైక్‌ ఇవ్వకపోతే.. ఏంటి పరిస్థితి అని సొంత పార్టీ లీడర్లతో చర్చిస్తున్నారట.. అయితే ఈ చర్చల్లో మాత్రం తాను శాసనసభకు వచ్చేది లేదని మాత్రం చెప్పడం లేదని సమాచారం.

మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కలను మాజీ సీఎం కేసీఆర్‌ తీరుస్తారా..! లేదంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఈసారి కూడా ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారా అనే దానిపై క్లారిటీ లేదు.. ఇదే విషయమై సొంత పార్టీ లీడర్లకు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారట. చూడాలి మరి గులాబీ బాస్‌ అసెంబ్లీకి వస్తరా లేదా అనేది మాత్రం మరో రెండురోజుల్లో తేలిపోనుంది..!

Also Read: BJP Telangana: మంత్రి ఉత్తమ్‌ దెబ్బకు.. బీఆర్‌ఎస్‌ కుదేలు..!

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిలకు సొంత పార్టీలోనే పొగ.. అధ్యక్ష పదవి ఊస్టింగేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News