Telangana govts big decision on employees retirement age: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు తీపికబురు చెప్పనుందని తెలుస్తొంది. రిటైర్మెంట్ ఏజ్ ను పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే రెండు నుంచి మూడు ప్రతిపాదనలు వెళ్లాయని.. అంతిమంగా ఒకదాన్ని ఎంపిన చేసి అమలుచేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుందని తెలుస్తొంది.
ముఖ్యంగా.. ఒక సంవత్సరం, రెండు సంవత్స రాలు, నాలుగు సంవత్సరాల వరకు పదవీ విర మణ వయస్సు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాద నలు చేరినట్టుగా సమాచారం. 2024 నుంచి 2028 వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 44 వేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కానున్నట్టుగా సమాచారం. గత ఏడాది డిసెంబర్ వరకు 7,995 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు.
మరొవైపు.. రిటైర్ అయిన వారికి.. వారికి రిటైర్ మెంట్ బెనిఫిట్ లు.. సుమారుగా రూ.20 వేల కోట్ల పైచిలుకు ఉంటుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు..ప్రభుత్వ ఉద్యోగుల వయసు పెంచి.. రిటైర్ మెంట్ భారంను తగ్గించుకునేందుకు సర్కారు ఆలోచనలు చేస్తుందని తెలుస్తొంది.
అయితే.. మార్చి 31వ తేదీ నాటికి ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయా లని కూడా ప్రభుత్వం గట్టి ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తొంది. అయితే.. ఇప్పటికే రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్లు. ఇప్పుడు మరల పెంచుతామని ప్రతిపాదనతో.. వారు ఏవిధంగా రియాక్ట్ అవుతారనే దానిపై అధికారులు అనేక కోణాల్లో చర్చలు జరుపుతున్నారంట.
కొంత మంది మాత్రం వాలంటరీ రిటైర్ మెంట్ కు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే రిటైర్ మెంట్ ఎప్పుడొస్తుందా.. కొందరు ఎదురు చూస్తున్నారంట. దీంతో మరల పెంపు నిర్ణయం ఎంత వరకు సక్సెస్ అవుతుందనే దానిపై చర్చలు జరుగుతున్నారంట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగి రిటైర్ అయితే సగ టున వారి కేడర్ ను బట్టి రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వంపై భారీగా భారం పడనుందని తెలుస్తొంది. ఇప్పటికే మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్ చెల్లింపుల విషయంలో కూడా ఆర్థిక శాఖ ఇబ్బందులు పడుతుందంట. ఈ నేపథ్యంలో రిటైర్ మెంట్ వయసు పెంచడం మాత్రం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter