Revanth Reddy Bumper Offer: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకు ఓ భారీ అస్త్రాన్ని సిద్దం చేసినట్టు సమాచారం. సొంత ఇంట్లో నుంచే కేసీఆర్‌కు దిమ్మతిరిగే రేంజ్‌లో ఓ నేతకు పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ వేసినట్టు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, కేసీఆర్ మేనల్లుడు ఉమేష్ రావుకు రాజన్న సిరిసిల్లా జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమేష్ రావుకు సిరిసిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీకి చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఇప్పటికే కేసీఆర్ అన్నకూతురు రమ్యరావు కేసీఆర్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఒక్క కేసీఆరే టార్గెట్‌గా రమ్యరావు పదునైన విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. ఉమేష్ రావు కూడా గతంలో కేసీఆర్ అవమానించడంతో బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చారు.. ఇప్పుడు అదే ఉమేష్ రావు అనే అస్త్రాన్ని వదిలేందుకు కాంగ్రెస్ సిద్దమైనట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ కొనసాగుతున్నారు. త్వరలోనే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్లా కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్ కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వ విప్ అయ్యారు. నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉందనే భావనతో ఆయన్ను మార్చవచ్చని భావిస్తున్నారు. అయితే ఆది శ్రీనివాస్ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఉమేష్ రావుకు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది..
ఇప్పటివరకు సిరిసిల్ల నియోజకవర్గంలో 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 14 సార్లు వెలమ సామజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఆ సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లా కావడంతో జిల్లా అధ్యక్ష పదవిని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుందట. సిరిసిల్లలో అదే సామాజికవర్గానికి చెందిన నేతకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తుందట.. అందుకుగానూ కాంగ్రెస్ సీనియర్ నేత కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేష్ రావు పేరును హైకమాండ్ చాలా సీరియస్‌గా పరిశీలిస్తోందట. అయనకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా కేటీఆర్‌కు చెక్ పెట్టినట్టు అవుతుందని అనుకుంటోందట. అటు చీటి ఉమేష్ రావు కాంగ్రెస్ పార్టీ లో 2006 నుంచి కొనసాగుతున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో కొనసాగిన సమయంలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలేదు. దాంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చీటి ఉమేష్ రావు కు ఇస్తే, కేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ కు గట్టి పోటి ఇచ్చినట్టు అవుతుందని అధిష్టానం భావిస్తోందట. మరోవైపు ఉమేష్‌రావుకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా వెలమ సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించవచ్చని పార్టీ పెద్దల ఎత్తుగడగా కనిపిస్తోంది.
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి రేసులో సంగీతం శ్రీనివాస్, బీసీసెల్ నాయకుడు కూస రవీందర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూత్ కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశారు సంగీతం శ్రీనివాస్. అటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సన్నిహితుడిగానూ ఉన్నారు. అటు కూస రవీందర్ పేరును కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ హైకమాండ్ ఉమేష్ రావే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఉమేష్ రావుకు పార్టీ పదవి పగ్గాలు అప్పగిస్తే ఓ వైపు కేటీఆర్‌కు చెక్ పెట్టడంతో పాటు... పార్టీకి కూడా కొత్త జోష్ వస్తుందని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో కొత్త అధ్యక్షుడి ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందరినీ కలుపుకుపోయే నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఉమేష్ రావు వైపే పార్టీ పార్టీ హైకమాండ్ మొగ్గుచూపుతోందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడమే తరువాయి చెబుతున్నారు. ఉమేష్ రావుకు రాజన్న సిరిసిల్లా బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీకి కొత్త ఊపు వస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఉమేష్ రావు వైపు నేతలంతా మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
Also Read: PAWAN KALYAN: పవన్‌కళ్యాణ్.. ఓ గేమ్ చేంజర్.. నెక్ట్స్ ఢిల్లీనేనా!
Also Read: T Congress: టీ కాంగ్రెస్ మహిళా చీఫ్ పదవి.. ఆమెకే కన్‌ఫర్మ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.