CM Revanth reddy performed Bhoomi pooja at secretariat: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి.. తనదైన స్టైల్ లో పాలన అందిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చిన పథకాలను అమలు చేస్తునే మరోవైపు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అనేక అక్రమాలకు పాల్పడిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ఎక్కడ తగ్గకుండా.. కాంగ్రెస్ ఆరోపణలు ప్రతీగా కౌంటర్ లు సైతం చేస్తుంది. ఈ క్రమంలో సెక్రెటెరియట్ ముందు ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ, సెక్రెటెరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటుపై కూడా పెద్ద దుమారమే చెలరేగింది.
తెలంగాణ తల్లి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆసక్తికర ఘటన
రేవంత్ రెడ్డి చేతిలో నుండి జారిపోయిన గుమ్మడికాయ pic.twitter.com/04sJgvOgwJ
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2024
ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి.. సచివాలయంలోపల తెలంగాణ తల్లి విగ్రహా ప్రతిష్టాపనకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. దీనిలో కాంగ్రెస్ మంత్రులు, హైదరాబాద్ మేయర్ తదితరులు హజరయ్యారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ భూమి పూజను నిర్వహిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పూజలో భాగంగా గుమ్మడికాయను చేతిలో తీసుకోగా.. అనుకొని విధంగా అది చేతిలో నుంచి ఒక్కసారిగా జారీపోయింది. ఈ హఠాత్పరిణామంలో అక్కడే ఉన్న హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా భయాందోళలకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి భూమి పూజకు ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ముఖ్యమంత్రులు కలిసి భూమి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడున్న పూజారులు గుమ్మడికాయను రేవంత్ రెడ్డి చేతికి అందించారు. అప్పుడు ఒక్కసారిగా అనుకొని ఘటన చోటు చేసుకుంది.
గుమ్మడికాయ ఒక్కసారిగా సీఎం రేవంత్ చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. అప్పుడు అక్కడున్న పూజారులు తిరిగి, గుమ్మడి కాయను ఆయన చేతికి అందించారు. దీంతో అక్కడున్న మంత్రులు, నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం కొంత మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కల్వకుంట్ల కవిత.. కూడా తీహార్ జైలు నుంచి విడులయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ జోష్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook