కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు(87) కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఆయనకు కరోనా సోకినట్లు సమాచారం. కరోనా తీవ్రత అధికం కావడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆదివారం ఎమ్మెస్సార్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించించారు. చికిత్స పొందుతూనే నేటి తెల్లవారుజామున సత్యనారాయణ రావు తుదిశ్వాస విడిచారని నిమ్స్ వైద్యులు తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ మరణం పట్ల పార్టీ నేతలు, ఇతర పార్టీల నేతలు సంతాపం తెలియచేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 1980 నుంచి 1983 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగానూ సేవలు అందించారు. 2006లో ఎమ్మెస్సార్ విసిరిన సవాల్ కారణంగా రాష్ట్ర సాధన కోసం కేసీఆర్(Telangana CM KCR) తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు నిర్వర్తించారు. గత కొంతకాలం నుంచి క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కరోనా(CoronaVirus) బారిన పడి ఎమ్మెస్సార్ కన్నుమూశారు.
Also Read: Pulse Oximeter: పల్స్ ఆక్సీమీటర్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ మేనేని సత్యనారాయణ రావు (ఎం.ఎస్.ఆర్) మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
— Telangana CMO (@TelanganaCMO) April 27, 2021
పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేనేని సత్యనారాయణ రావు (MSR) మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని, సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read: New COVID-19 Guidelines: మే 1 నుంచి మూడో దశలో కరోనా వ్యాక్సినేషన్, కేంద్రం మార్గదర్శకాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook