MLA Jaggareddy: స్టాలిన్‌ దమ్మున్నోడు, సీఎం అంటే అలానే ఉండాలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Mla Jaggareddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చ లేపుతున్నాయి. ప్రధాని మోదీకి టీఆర్ఎస్‌ నేతలు వరుసగా స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మోదీతో పాటు కేసీఆర్‌ కు చురకలు అంటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ను మెచ్చుకుంటునే.. కేసీఆర్‌ ను కడిగిపారేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 01:48 AM IST
  • తమిళనాడు సీఎం స్టాలిన్‌ పై ప్రశంసలు
  • కేసీఆర్‌, మోదీలపై విమర్శలు
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
MLA Jaggareddy: స్టాలిన్‌ దమ్మున్నోడు, సీఎం అంటే అలానే ఉండాలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

MLA Jaggareddy: తమిళనాడు సీఎం స్టాలిన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించాడు. స్టాలిన్‌ దమ్మున్న సీఎం అని కితాబిచ్చారు. ప్రజల ముందు ప్రధానిని నిలదీసిన వ్యక్తి స్టాలిన్‌ అని మెచ్చుకున్నాడు. సీఎం  అంటే స్టాలిన్‌ లా ఉండాలని చెప్పారు. తమిళలంలోనే మాట్లాడుతా అంటూనే జీఎస్టీ నిధులు అడిగారని గుర్తుచేశారు. ప్రధాని రాక సందర్భంగా కేసీఆర్‌ తెలంగాణలో ఉంటే ప్రధానిని నిలదీసేవాడు కదా అని ప్రశ్నించారు. మోదీ- కేసీఆర్‌ ల మధ్య చీకటి రాజకీయ ఒప్పందం నడుస్తుందని దీన్ని బట్టే అర్థమౌతోందని జగ్గారెడ్డి చెప్పారు.  కేసీఆర్‌ ఇప్పటికే చాలా శుభవార్తలు చెప్తా అన్నాడని.. కానీ ఇప్పటికీ ఒక్కటి చెప్పలేదన్నారు. దేశంలో కాంగ్రెస్‌- బీజేపీని కాదని కేసీఆర్‌ ఏం చేయలేడని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ ఫెయిల్‌ అయ్యారని విమర్శించారు.

ప్రధాని హోదాలో తెలంగాణకు వచ్చిన మోదీ.. ఎలాంటి హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లకుండా.. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు ప్రస్తావించలేకపోయారన్నారు. ఒక్క రోజు కూడా గుడికి వెళ్లని బండి సంజయ్‌.. శివలింగాల మీద రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. మతాల పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతుందని జగ్గారెడ్డి మండిపడ్డారు.  కాంగ్రెస్‌ పార్టీ మతాలు, కులాలపై రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు. మోదీ- కేసీఆర్‌ చీకటి రాజకీయ అక్రమ సంబంధం ఉందని తేటతెల్లమైపోయిందన్నారు. అందుకే కేసీఆర్‌ బెంగళూరుకు పారిపోయాడని విమర్శించారు. బీజేపీ పార్టీలా కాంగ్రెస్‌ ఏనాడూ కూడా ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

Also Read: YS Jagan Davos Tour: దావోస్ వేదికగా ఏపీకు లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి బాటలో విశాఖ

Also Read: High Cholesterol Food: అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News