మీరు పుట్టకముందే తెలంగాణలో రైలు : రేవంత్ రెడ్డి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుస్తున్నాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. 

Last Updated : Feb 23, 2020, 04:42 PM IST
మీరు పుట్టకముందే తెలంగాణలో రైలు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుస్తున్నాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్నం గోస పేరుతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఏడాదిలో ఇళ్లు పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం సరికాదని విమర్శించారు.

గత ఆరు సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో  రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని, రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణలో నిధులు దారి మళ్లుతుంటే కిషన్‌రెడ్డి ఎందుకు సమీక్ష చేయట్లేదని నిలదీశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ అంతర్గత సంబంధాలేంటో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయ కోణం ఉంటుందని అన్నారు.

దేశంలో అభివృద్ధి కుంటుబడిపోయిందని, మాటలతో దేశ ప్రజానీకాన్ని మాభపెడుతున్నారని అన్నారు. అయితే, ప్రధాని మోదీ పుట్టకముందు నుంచే తెలంగాణలో రైల్వేస్టేషన్లు ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప రైల్వే అంటే ఏంటో తెలియదని, చాలా ప్రాంతాల్లో రైలు సౌకర్యం ఉండేది కాదని ఆయన అనడం సరికాదని వ్యాఖ్యానించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News