Desapati fires on Dil Raju: తెలంగాణ లో కల్లు ,మటన్ కే వైబ్ ఉంటుంది అన్న దిల్ రాజు తెలంగాణ లో సినిమా లు ఎందుకు విడుదల చేయాలన్నారు ? రేట్లు ఎందుకు పెంచాలని ప్రశ్నించారు. దిల్ రాజు మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి. కోమటి రెడ్డి బెనిఫిట్ షో ల పై పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తీరా తనవాళ్ల సినిమా అనగానే ప్రత్యేక అనుమతులిచ్చారు. తెలంగాణ సంస్కృతి పై రేవంత్ ప్రభుత్వం చేస్తోన్న దాడిని ఖండిస్తున్నామన్నారు. మాట మీద నిలబడని రేవంత్ తీరును ప్రజలు గమనించాలన్నారు.
పుష్ప 2 సందర్భంగా ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వనన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించిన దిల్ రాజు కోసం టికెట్ రేట్స్ పెంచుకోవానికి పర్మిషన్ ఎలా ఇచ్చాడని అన్నారు.
గేమ్ చేంజర్ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమా రామ్ చరణ్ రెండు లేదా మూడు పాత్రల్లో నటించాడా లేదా అనేది మరికాసేట్లో తేలిపోనుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.