MLA Redya Naik Fires On Woman: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు వరుసగా నిరసన సెగలు ఎదురువుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గోపాతండాలో ఎమ్మెల్యే పర్యటించగా.. మహిళలు నిలదీశారు. 'నువ్వు ఏమి చేశావు.. కేసీఆర్ ఏమి చేసారు..?' అంటూ ఓ మహిళ ప్రశ్నించింది. దీంతో మహిళపై ఎమ్మెల్యే రెడ్యానాయక్ సీరియస్ అయ్యారు. వెంటనే పంచాయితీ సెక్రటరీని పిలిపించి మాట్లాడారు. ఆమె ఎక్కువగా మాట్లాడుతోంది.. పెన్షన్ ఆపేయాలని ఆదేశించారు. వెంటనే ఆమె పక్కన ఉన్న మహిళలు కూడా ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా.. సోమవారం నర్సింహులపేట మండలంలో ఎమ్మెల్యే పర్యటించగా.. ఓ వికలాంగుడు పెన్షన్ కోసం నిలదీసిన విషయం తెలిసిందే. తనకు అన్ని అర్హతలు ఉన్నాయని.. పింఛన్ కార్డు ఉన్నా.. తనకు ఇప్పటివరకు పెన్షన్ ఇవ్వడం లేదని జక్కుల యాకన్న అనే దివ్యాంగుడు అన్నాడు. ట్రై సైకిల్‌పై వచ్చిన యాకన్న.. ఎమ్మెల్యేను అడ్డగించి అన్ని రకాల సర్టిఫికెట్లు, ఆసరా గుర్తింపు కార్డు ఆయనకు చూపించారు.
పెన్షన్ కోసం ఎంపీడీవోను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. నర్సింహులపేట మండలంలోని మంగలి తండాలో రూ.ఐదున్నర లక్షలతో కల్వర్టు ప్రహరి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మరిపెడ మండలంలోని భోట్యా తండ గ్రామపంచాయతీ పరిధిలోని జమ్మికుంట తండాలో శ్రీ సంతోష్ సేవాలాల్ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
Also Read: Bandi Sanjay: A నుంచి Z వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవే.. బండి సంజయ్ కౌంటర్
ఎమ్మెల్యే రెడ్యానాయక్ విషయానికి వస్తే.. ఆయన ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉగ్గంపల్లి సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రెడ్యానాయక్.. అంచలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో ఓ సారి మంత్రిగా కూడా పనిచేశారు. 1989 నుంచి 2004 వరకు డోర్నకల్ నుంచి వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అప్పటి టీడీపీ అభ్యర్థి సత్యవతి రాథోడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి.. 2018 ఎన్నికల్లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Also Read: Google New Rules: లోన్ యాప్‌లపై గూగుల్ కఠిన చర్యలు.. కొత్త నిబంధనలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook