TRS MLA: తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే రెండవరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్నారు. మంగళవారం కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. తొమ్మిది గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన కిషన్ రెడ్డి.. రాత్రి 10 గంటల తర్వాత బయటికి వచ్చారు. విదేశాలకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఎమ్మెల్యే నుంచి వివరాలు తీసుకున్నారు ఈడీ అధికారులు. మంచిరెడ్డి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 2014 ఆగస్టులో విదేశాలకు వెళ్లారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పర్యటించారు. తనతో పాటు ఫారెక్స్ కార్డ్ తీసుకెళ్లిన కిషన్ రెడ్డి.. డబ్బులు అవసరం కావడంతో అమెరికాలోని తన బంధువుల నుంచి తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. విదేశాల్లో జరిగిన మనీ ట్రాన్స్ ఫర్స్ ఇండియాలోని మంచిరెడ్డి బ్యాంక్ అకౌంట్స్ తో లింకయ్యాయి. ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. ఫెమా యాక్ట్ కింద 2015లో రిజిస్టరైన కేసుల్లో వివరాలను ఈడీ రాబడుతోంది. ఫెమా కేసులో 2018లోనే మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారం గురించే ఇప్పుడు పూర్తి వివరాలను ఈడీ అధికారులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడినట్లు కూడా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన చీకోటీ ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలోనే మంచిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఓ కేసు విచారణలో ఓ వ్యక్తిని ఈడీ అధికారులు విచారించగా మంచిరెడ్డి లావాదేవీలు బయటపడ్డాయని తెలుస్తోంది. తక్కువ సమయంలోనే మంచిరెడ్డి దాదాపు 88 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిపారని గుర్తించారని సమాచారం. శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్ లాండ్ దేశాల్లో ఈ లావాదేవీలు జరిగాయని ఈడీ విచారణలో తేలిందంటున్నారు. క్యాసినో, గోల్డ్ మైన్లలో భారీగా నగదును కిషన్ రెడ్డి పెట్టుబడి పెట్టినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యే వాట్సాప్ సమాచారాన్ని ఈడీ అధికారులు రిట్రీవ్ చేసినట్టు తెలుస్తోంది. అందులో లభించిన సమాచారం ఆధారంగానే ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.
Also Read : Telangana Rain Alert : మరో మూడు రోజులు కుండపోత.. జనాలు బయటికి రావొద్దు! తెలంగాణకు ఐఎండీ అలెర్ట్..
Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కీలక నేత అనుచరులు అరెస్ట్.. తెలంగాణలో కలకలం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి