Electric bus Fire accident: ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు.. కాలి బూడిదైన ఎలక్ట్రిక్ బస్సు..

Fire accident: షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఎలక్ట్రిక్‌ బస్సు కాలి బూడిదైన ఘటన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ డిపోలో చోటుచేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 06:02 PM IST
  • ఛార్జింగ్ పెడుతుండగా ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం
  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఘటన
Electric bus Fire accident: ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు.. కాలి బూడిదైన ఎలక్ట్రిక్ బస్సు..

Electric bus Fire accident: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్‌ (Electric bus) దగ్ధమైంది. ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి (Fire accident).. బస్సు కాలి బూడిదైంది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో.. చుట్టూ దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. 

సిబ్బంది వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న మరికొన్ని బస్‌లను దూరంగా తరలించారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సిబ్బంది అలర్ట్ గా లేకపోతే ఛార్జింగ్ పెట్టిన మరో బస్సుకూడా దగ్ధమయ్యేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్ విలువ రూ. 3కోట్లు వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Also Read:chinni krishna: తనపై దాడి చేశారంటూ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సినీ రచయిత చిన్ని కృష్ణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News