ఈటెల రాజేందర్ కేబినెట్ పదవిపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

ఈటల రాజేందర్ కేబినెట్ పదవిపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

Last Updated : Sep 1, 2019, 12:13 AM IST
ఈటెల రాజేందర్ కేబినెట్ పదవిపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: కేబినెట్‌లో మంత్రి పదవి తాను అడుక్కుంటే వచ్చింది కాదని.. టీఆర్ఎస్ పార్టీలోకి తాను మధ్యలోనో లేక బతికొచ్చినోడినో కాదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ ఉద్యమంలో, పార్టీ కార్యక్రమాల్లో మొదటి నుంచి తాను ఉన్నానని, తాము గులాబీ జండా ఓనర్లమని మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందిస్తూ.. ''గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్'' అని అన్నారు. గులాబీ జెండాను కేసీఆర్ ఒక్కరే రూపొందించారని అభిప్రాయపడిన ఎర్రబెల్లి.. తాను కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచి పార్టీ నుంచి లేఖ ఇప్పించానని గుర్తు చేసుకున్నారు. 

ఈటెల రాజేందర్ వ్యాఖ్యల గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తావిస్తూ.. ఆ అంశం సమసిపోయిందని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News