ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత ; భవితవ్యంపై బడా నేతల్లో బెంగ ?

 ఈ రోజు విడుదలయ్యే ఎన్నికల ఫలితాలతో నేతల భవితవ్యం తేలనుంది.

Last Updated : Dec 11, 2018, 07:52 AM IST
ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత ; భవితవ్యంపై బడా నేతల్లో బెంగ ?

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 1,821 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.81 కోట్ల మంది ఓటర్లలో 73.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఓటర్ల తమ భవితవ్యాన్ని ఎలా తేల్చారనే దానిపై నేతల్లో ఉత్కంఠత నెలకొంది. సర్వే ఫలితాల ప్రకారం బడానేతలు పల్టీ కొట్టే సూచనలు ఉన్నాయని తేలడంతో సీనియర్ నేతలు సైతం తమ భవితవ్యంపై బెంగపెట్టుకున్నారు. 

సీఎం కేసీఆర్ కు సైతం తన సొంత నియోజకవర్గం గజ్వేలులో ఎదూరీత తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీకి చెందిన ఒంటేరు ప్రతాపర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినట్లు తేలింది. పైగా ఆయన భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపుపై నీలినీడకలు కమ్ముకున్నాయి. అలాగే కేసీఆ్ కేబినెట్ లో దాదాపు డజన్ మందిని ఓటర్లు తిరస్కరించారనే వార్తలు రావడంతో ఆ జాబితాలో ఎవరున్నారనే తాజా మాజీ మంత్రులకు వణుకు మొదలైంది. 

ఇటు కాంగ్రెస్ లో సైతం సీనియర్ నేతలు డీకే అరుణా, రాజనర్సింహా, పొన్నాల, జానారెడ్డి లాంటి సీనియర్లకు సైతం ఓటమి తప్పేలా లేదనే వార్తలు వెలువడున్న నేపథ్యంలో తమ భవితవ్యంపై ఆయా నేతలు బెంగపెట్టుకున్నారు..ఇలా బడా నేతలను భయపెడుతున్న ఈ ఫలితాలు ఎవరికి సంతోషాన్ని మిగుల్చుతోందో..ఎవరిని పాతాళానికి పడేస్తోందో తేలాలంటే మరికొన్ని గంటల వేచిచూడక తప్పదు మరి.

Trending News