హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 10 బైకులు దగ్ధం!

నగర శివార్లలో భారీ అగ్ని ప్రమాదం

Last Updated : Sep 14, 2018, 06:52 PM IST
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 10 బైకులు దగ్ధం!

హైదరాబాద్ నగర శివార్లలోని హయత్‌నగర్ సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మునగనూరులోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టింబర్ డిపోలో భారీగా కలప ఉండటం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న బైక్ మెకానిక్ షాప్‌కు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మెకానిక్ షాప్‌ మూసేసి ఉండటంతో అందులోని 10 బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.5లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 

ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Trending News