Monkey Pox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది. మంకీఫాక్స్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. పలు దేశాల్లో మంకీఫాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొవిడ్ తరహాలో మంకీపాక్స్ తో ప్రపంచానికి ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీఫాక్స్ మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. రాష్ట్రంలో తెలంగాణలో తొలి మంకీఫాక్స్ కేసు నమోదైందని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. జూలై 6న ఇతను దుబాయ్ నుంచి వచ్చాడు. మంకీఫాక్స్ లక్షణాలు ఉండటంతో అనుమానిత వ్యక్తిని
హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు.
ఈనెల 20వ తేదిన సదరు వ్యక్తికి ఫీవర్ వచ్చింది. మూడు రోజుల తర్వాత శరీరంపై దద్దుర్లు కనిపించాయి. దీంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటలకు వెళ్లాడు. అక్కడి డాక్టర్లు అతనిలో మంకీఫాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. కామారెడ్డి హాస్పిటల్ నుంచి 108లో హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు. మంకీఫాక్స్ లక్షణాలున్న వ్యక్తి శాంపిల్స్ సేకరించి పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. అతన్ని ఫీవర్ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మంకీఫాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తిని కలిసిన ఆరుగురిని గుర్తించి పరీక్షించారు. అయితే వాళ్లకు ఎలాంటి మంకీఫాక్స్ లక్షణాలు లేవని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు చెప్పారు. మంత్రి హరీశ్‌రావు పరిస్థితిని సమీక్షించారని, మంత్రి సూచనల ప్రకారం అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంకీపాక్స్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు శ్రీనివాసరావు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదన్నారు.
ఇక ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే అతను ఎలాంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేకపోవడం వైద్య వర్గాలను కలవరపరుస్తోంది. ఢిల్లీలో మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఓ పార్టీకి హాజరయ్యారని అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం ఆ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించగా ఆస్పత్రిలో చేరారు. అతని నమూనాలను సేకరించి పుణె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా పాజిటివ్‌గా తేలింది. దేశంలో ఇప్పటివరకు నాలుకు మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. మొదటి మూడు కేసులు కేరళలో నమోదు కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో నాలుగో కేసు నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 16 వేలకు పైగా కేసులు వచ్చాయి. మంకీఫాక్స్ తో ఆఫ్రికాలో ఐదుగురు చనిపోయారు.
Also Read: కళ్లకు కాటుక పెట్టి.. నాభి అందాలతో పైకెప్పిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య!
Also Read: 190 రన్స్ వద్ద పడిన టెన్షన్.. 390లలో ఉన్నప్పుడు కూడా పడలేదు: సామ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.