Road Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

హైదరాబాద్ -   సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం (Nalgonda Road Accident)లో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Last Updated : Sep 4, 2020, 08:30 AM IST
Road Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పైపులైన్‌ను ఢీకొట్టడంతో నలుగురు యువకులు అక్కడికక్కడి దుర్మరణం చెందారు. హాస్పిటల్‌కు తరలిస్తుంటే మరో యువకుడు చనిపోయాడు. హైదరాబాద్ -   సాగర్ హైవేపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయిదుగురు యువకులు హైదరాబాద్ నుంచి మల్లెపల్లికి కారులో బయలుదేరారు. 

చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాటర్ పైపు లైనును ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడిని హాస్పిటల్‌కు తరలిస్తుంటే చనిపోయినట్లు సమాచారం. నిద్రమత్తుతో పాటు అతివేగంగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

 

Trending News