Singer Madhu Priya: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సింగర్ మధుప్రియ..

Singer Madhu Priya:ఫోక్ సింగర్ మధుప్రియ కాంగ్రెస్ పార్టీలోక చేరుతున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ మధుయాష్కిని కలవడం ప్రస్తుతం తీవ్ర రచ్చకు దారితీసింది. ఫోక్ సింగర్ గా మధుప్రియ తనకంటూ  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 29, 2024, 06:42 PM IST
  • ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో బీజేపీ మార్క్..
  • అమిత్ షాను కలసి ధన్యవాదాలు తెలిపిన నవనీత్ కౌర్ రాణా..
Singer Madhu Priya: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సింగర్ మధుప్రియ..

Folk Singer Madhu Priya Will Joins Congress Party Soon: తెలంగాణాలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే గులాబీ బాస్ కు దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. అనేక మంది పార్టీ నేతలు క్యూలు కట్టినట్లుగా పార్టీనీ వదిలిపోతున్నారు. బీఆర్ఎస్ హాయంలో అధికారం, హోదాను అనుభవించి ఇప్పుడు, పార్టీ కష్టకాలంలో ఒక్కొక్కరుగా వీడిపోవడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక తాజగా.. కేకేశవరావు, కడియం శ్రీహారి వంటి నమ్మకస్తులు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరడం రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. ఇన్నాళ్లు కేసీఆర్ వెంట ఉండి, ఇప్పుడు హోదా, పదవుల కోసం పాకులాడుతూ పార్టీని వీడటం ఏంటని రాజకీయాల్లో కొందరు చర్చించుకుంటున్నారు.

Read More: Snake Attack: పాముతో లిప్ లాక్ కోసం ట్రైచేశాడు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..అసలేం జరిగిందంటే..?

ఇక బీఆర్ఎస్ ను వీడుతున్న వారు భవిష్యత్తులో కాళ్లు పట్టుకుని వేడుకున్న, పార్టీలోకి రానిచ్చేది లేదని కేటీఆర్, హరీష్ రావు లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడం పక్కా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఫోక్ సింగర్ మధు ప్రియ కూడా కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఆమె.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మధుయాష్కీని కలిశారు. అదే విధంగా.. ఆమె గతంలో బీఆర్ఎస్ కు చెందిన ఏ బహిరంగా సభ జరిగిన, పార్టీ కార్యక్రమం జరిగిన కూడా  మధు ప్రియ హుషారైన పాటలతో సభలను హోరెత్తించేవారు.

ఈ క్రమంలో..  సింగర్ మధు ప్రియ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక మధు ప్రియ విషయానికి వస్తే ఆడపిల్ల నమ్మా.. అనే పాటతో తెలంగాణాలో ఉద్యమంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. అతిచిన్న వయసులోనే ఫోక్ సాంగ్స్‌  పాడుతూ అందరిని ఆకట్టుకున్నారు. మధుప్రియ ఇప్పటికే పెళ్లి జరిగింది. ఆమె శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..

కానీ పెళ్లైన కొద్ది రోజులకే డైవర్స్ కూడా తీసుకుంది. అప్పట్లో వీరి పెళ్లి, డైవర్స్ ల గొడవ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారిన విషయం తెలిసిందే. ఇక మధుప్రియ కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత.. బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాలలో తనదైన స్టైల్ లో ఫోక్ సాంగ్స్ పాడుతూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలలో మరింత జోష్ ను నింపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మధుప్రియ కూడా బీఆర్ఎస్ ను వీడి, కాంగ్రెస్ లోకి చేరడం కూడా వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News