Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి.. ఇద్దరు విద్యార్థుల అరెస్టుతో కలకలం

Basara IIIT: సరస్వతి నిలయం కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్రంగా మారింది. ఏదో ఒక సమస్య వెలుగుచూస్తూ క్యాంపస్ లో కల్లోలం స్పష్టిస్తోంది. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతున్న నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తాజాగా మరో కలకలం రేగింది. క్యాంపస్ లో గంజాయి లభించింది. ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ  పోలీసులకు పట్టుబడ్డారు

Written by - Srisailam | Last Updated : Aug 21, 2022, 11:14 AM IST
  • బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం
  • గంజాయి సేవిస్తూ పట్టుబడిన స్టూడెంట్స్
  • ఇద్దరు విద్యార్థులపై కేసు
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి.. ఇద్దరు విద్యార్థుల అరెస్టుతో కలకలం

Basara IIIT: సరస్వతి నిలయం కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్రంగా మారింది. ఏదో ఒక సమస్య వెలుగుచూస్తూ క్యాంపస్ లో కల్లోలం స్పష్టిస్తోంది. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతున్న నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తాజాగా మరో కలకలం రేగింది. క్యాంపస్ లో గంజాయి లభించింది. ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ  పోలీసులకు పట్టుబడ్డారు. బాయ్స్ హాస్టల్ వన్ లో వెలుగుచూసిన ఈ ఘటన ట్రిపుల్ ఐటీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.హాస్టల్ రూమ్ లో రహస్యంగా గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ముథోల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ట్రిపుల్ ఐటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తన హాస్టల్ గదిలో గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. గంజాయితో దొరికిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరిది కరీంనగర్ జిల్లా కాగా.. మరొకరిదిరి  మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా. ఇద్దరు విద్యార్థులపై ఎన్దీపీయే అక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇద్దరు విద్యార్థుల నుంచి 100గ్రాములకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీలో డీఎస్పీ, సీఐతో పాటు దాదాపు 20 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. పటిష్టమైన భద్రత ఉండే క్యాంపస్ లోకి గంజాయి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు కలకలం రేపుతోంది.  విద్యార్థులకు గంజాయి ఎలా వచ్చింది.. ఇంకా ఎవరైనా విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారా.. గంజాయి వెనుక ఎవరెవరి హస్తం ఉంది అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాంపస్ లోనే విద్యార్థులకు గంజాయి సరఫరా అయిందా లేదా సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. క్యాంపస్ లో పని చేస్తున్న సిబ్బంది ఎవరైనా బయటి నుంచి గంజాయి తెచ్చి విద్యార్థులకు ఇస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో సెలవులపై ఇంటికి వెళ్లిన  ఓ స్టూడెంట్  తిరిగి వచ్చే సమయంలో బ్యాగ్ లో సిగరెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నాడు. గేట్ దగ్గర సిబ్బంది తనిఖీ చేయగా సిగరెట్ ప్యాకెట్లు లభించాయి. దీంతో ఆ విద్యార్థిని 8 రోజుల పాటు సస్పెండ్ చేశారు. అనంతరం పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి మొదటి తప్పుగా క్షమించి వదిలేశారు.

మరోవైపు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్ లో పైనుండి సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. P1 విద్యార్థి జూల్లూరి శ్రావణ్ మెడకి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని క్యాంపస్ లోని ఆసుపత్రికి తరలించారు.

Also Read: Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో వరద విలయం..22 మంది మృతి, పలువురు గల్లంతు..!

Also Read:Vijay Devarakonda Boycott Liger: ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News