Telangana Govt Employees: మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్.. రేపు సెల‌వు ప్రకటిస్తూ ఉత్తర్వులు..

Telangana Govt: రాష్ట్రప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 10:55 PM IST
Telangana Govt Employees: మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్.. రేపు సెల‌వు ప్రకటిస్తూ ఉత్తర్వులు..

Telangana Govt: మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. మ‌హిళా ఉద్యోగుల‌కు రేపు (మంగ‌ళ‌వారం) సెల‌వు ప్రకటించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. మార్చి 8 అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని (International Women's day) పుర‌స్క‌రించుకొని ప్ర‌తి ఏడాది మ‌హిళా ఉద్యోగుల‌కు (Govt Women Employees) ప్ర‌భుత్వం సెలవు ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళా సంబురాలు కొన‌సాగుతున్నాయి. వివిధ రంగాల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన మ‌హిళ‌ల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా టీఎస్ఆర్టీసీ (TSRTC) మ‌హిళ‌ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మ‌హిళ‌ల కోసం హైద‌రాబాద్‌లో పీక్ అవ‌ర్స్‌లో నాలుగు ప్రత్యేక ట్రిప్పుల‌ను న‌డ‌ప‌నుంది. అంతేకాకుండా 60 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌లకు ఉచితం ప్రయాణం కల్పించింది ఆర్టీసీ. మహిళలకు ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణను కూడా ఇవ్వనుంది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మహిళలకు 30రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 31 మార్చి 2022లోపు తమ పేర్లను దగ్గర్లోని డిపోలో నమోదు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. 

Also Read: Telangana Congress: ఇది రాజ్యాంగ విరుద్ధమే..సభ నిర్వహణ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News