Heavy Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడుగా పశ్చిమ మధ్య బంగాళాకాతంలో మరో ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి.
జూన్ దాటి జూలై నెల సగం రోజులైపోయాయి. అయినా సాధారణ వర్షపాతంతో పోలిస్తే తెలంగాణలో 50-60 శాతం వరకూ లోటు కన్పిస్తోంది. రానున్న రెండు మూడ్రోజుల్లో కురవనున్న భారీ వర్షాలతో వర్షపాతం లోటు చాలా వరకూ తీరవచ్చని అంచనా. ఎందుకంటే నైరుతి బంగాళాకాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా పశ్చిమ మధ్య బంగాళాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. దాంతో వచ్చే రెండు మూడ్రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదు కావచ్చు. అదే సమయంలో హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అంటే హైదరాబాద్‌లో వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వివరించింది. వాస్తవానికి నిన్నటి నుంచి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం కురుస్తోంది. ఇక వచ్చే రెండు మూడ్రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నిన్న వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఓసారి పరిశీలిద్దాం. మహబూబ్‌నగర్ జిల్లా గార్లలో అత్యధికంగా 7.35 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా ఆర్డీవో ఆఫీస్ ప్రాంతంలో 6.15, రాజ్‌పల్లిలో 6.05, ఖమ్మం జిల్లా కారెపల్లిలో 5.78, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 5.58 సెంటీమీర్ల వర్షపాతం నమోదైంది.
Also read: Heavy Rains Alert: తెలంగాణలో వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు , బయటికి వెళ్లవద్దని హెచ్చరిక జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook