Tungabhadra Dam: తుంగభద్రకు భారీగా వరద పోటెత్తుతోంది. ఈ ఇయర్ అంచనాలకు మించి వరద నీరు వచ్చిచేరుతోంది. ఈ సారి 173 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు అంచనా వేస్తోంది. ప్రస్తుత యేడాది ప్రారంభంలో తుంగభద్ర బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీలు. ఆ కెపాసిటీ కంటే తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత అధికంగా ఉండే అవకాశం ఉందని తుంగభద్రకు పోటెత్తుతున్నవరదతో సాగునీటిరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్ల తరహాలోనే ఈ సారి కూడా రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
లాస్ట్ ఇయర్ డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లోకి 249.02 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో 104.70 టీఎంసీలను డ్యామ్‌లో నిల్వచేసి.. కాలువలకు 25 టీఎంసీలు విడుదల చేశారు. మిగిలిన 120 టీఎంసీలను డ్యామ్ క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు శ్రీశైలంకు వదిలేశారు. తుంగభద్ర డ్యామ్‌లోకి నవంబర్ చివరి వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈలెక్కన డ్యామ్‌లో నీటి లభ్యత బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే అధికంగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసింది. ఇప్పటికు తుంగభద్ర పరివాహాక రాష్ట్రాలైన కర్ణాటకకు 151.49, ఆంధ్ర ప్రదేశ్ కు 72 టీఎంసీలు..తెలంగాణకు 6.51 టీఎంసీల చొప్పున కేటాయించింది. ప్రతి యేటా తుంగభద్రలో పూడిక పేరుకు పోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలే అని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం, నీటి లభ్యత ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. నాలుగేళ్లు ఏటా సగటున 69 టీఎంసీలను బోర్డు నుంచి ప్రభుత్వం విడుదల చేయించింది. గతేడాది తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. 40 టీఎంసీలు రాష్ట్రానికి దక్కింది. ఈ ఏడాది నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter