Telangana MCA Student Rinesh committed Suicide in a Private Hostel at Dilsukhnagar: గత కొంత కాలంగా విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తల్లిదండ్రులు మందలించారని, ఫోన్ కొనివ్వలేదని, బైక్ కొనలేదని, ప్రేమలో విఫలమయ్యానని, చదువులో రాణించలేకపోతున్నాననే పలు కారణాలతో ఆత్మహత్య చేసుకుని.. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. తాజాగా ఓ ఎంసీఏ విద్యార్థి ప్రైవేట్ హాస్టల్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సూసైడ్ నోట్ రాసి మరీ అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ పట్టణానికి చెందిన జాలా లింగేశం, లక్ష్మమ్మ దంపతుల చిన్న కుమారుడు రినేష్. ఈ ఏళ్ల రినేష్.. దిల్‌సుఖ్‌నగర్ మధురాపురి కాలనీలోని రాఘవేంద్ర బాలుర హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ కళశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలానే మంగళవారం కూడా కళశాలకు వెళ్లి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో తోటి విద్యార్థి అయిన సాయి హాస్టల్ రూం తలుపు తట్టగా.. రినేష్ తీయలేదు. తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో.. సాయి కిటికీలోంచి చూడగా రినేష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే హాస్టల్ నిర్వాహకుడికి సమాచారం ఇవ్వగా.. తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే రినేష్ చనిపోయాడు.
హాస్టల్ నిర్వాహకుడు రమేష్ 108కు సమాచారం ఇచ్చి.. ఆపై రినేష్ తండ్రి లింగేశంకు విషయం చెప్పాడు. హాస్టల్ నిర్వాహకుడు రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్టల్‌కు చేరుకున్ను రినేష్ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆపై మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని ఇక్కడి నుంచి ఎందుకు తరలించారని వాదనకు దిగారు. రినేష్ కుటుంబ సభ్యులకు పలు విద్యార్ది సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్‌చౌక్ వద్ద అందరూ ఆందోళన చేపట్టారు.
రినేష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు రినేష్ స్నేహితులను విచారించారు. గత 10 రోజులుగా రినేష్ చాలా డల్‌గా ఉంటున్నాడని, తనకు చదువు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపినట్లు వారు పోలీసులకు చెప్పారు. రినేష్ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపడతామని ఎల్‌బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. 'ఐ మిస్ యూ నాన్న, మమ్మీ, అన్న, స్నేహతులు’ అని రాసున్న సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
Also Read: Telangana Covid 19 Cases: మళ్లీ విజృభింస్తోన్న కరోనా వైరస్.. తెలంగాణాలో కొత్తగా ఎన్ని కేసులంటే?
Also Read: BCCI Contract: మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ.. జెమీమా, షఫాలీకి నిరాశే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.