హైదరాబాద్లో మెట్రో పిల్లర్ పగుళ్లు వచ్చాయని సాజాజిక మాధ్యమాల్లో చక్కెర్లుకొట్టిన నేపథ్యంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. నగరంలోని ఐఎస్బీ-గచ్చిబౌలి మార్గంలో మెట్రో పిల్లర్లో పగుళ్లంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ మార్గంలో మెట్రో లైనే లేదని..అలాంటప్పుడు పగుళ్ల ఎలా ఏర్పడతాయని ఆయన ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న మెట్రో పిల్లర్.. హైదరాబాద్లోని మెట్రో పిల్లర్ కాదు..అది పాకిస్తాన్ లోని పెషావర్ కు చెందిన మెట్రో పిల్లర్ అని వివరణ ఇచ్చారు. మన మెట్రో పిల్లర్లు వేల టన్నుల బరువు, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మించామని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని..ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.