Hyderabad Police: మందేసి రోడ్డెక్కారా ఇక మీ 'అంతే'.. ఈ రోడ్లు అన్నీ క్లోజ్!

Hyderabad Police Restrictions: డిసెంబర్ 31వ తేదీ కావడంతో మందు బాబులు అందరూ డ్యూటీ ఎక్కేందుకు సిద్ధమయ్యారు, ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 31, 2022, 06:41 PM IST
Hyderabad Police: మందేసి రోడ్డెక్కారా ఇక మీ 'అంతే'.. ఈ రోడ్లు అన్నీ క్లోజ్!

Hyderabad Police Restrictions on December 31st Night: కొత్త సంవత్సరం వచ్చేసింది, ఇంకా కొన్ని గంటల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ వేడుకల్లో మునిగిపోతారు. అయితే యువత మద్యం మత్తులో మునిగాక ఇళ్లకు వెళదామనో ఇంకో కారణంతోనో రోడ్డెక్కుతారని భావిస్తున్న హైదరాబాద్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

మద్యం తాగి వాహనాలు నడిపినట్లు అయితే తొలిసారి రూ.10 వేలు జరిమానా విధిస్తామని అలాగే మద్యం తాగి పట్టుబతే, 6 నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక మద్యం సేవించి వాహనం నడుపుతూ రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని, డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్ కు రవాణా శాఖ సిఫార్సు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇక తొలిసారి 3 నెలల సస్పెన్షన్, రెండోసారి దొరికితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని, కేవలం బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లైఓవర్లకు మాత్రం మినహాయింపు ఇస్తున్నామని ప్రకటించిన పోలీసులు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక రాత్రి 10 గంటల తర్వాత సిటీలోని లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలపై నిషేధం విధిస్తున్నామని ఎయిర్ పోర్టు వైపు వెళ్లే కార్లకు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదని ప్రకటించారు. విమాన టిక్కెట్లు చూపిస్తే పీవీ ఎక్స్ ప్రెస్ వే పైనుంచి రాకపోకలకు అనుమతి ఇస్తామని లేదంటే అది కూడా అనుమతి ఉండదని పేర్కొన్నారు. సో బీ కేర్ ఫుల్ అబ్బాయిలూ రోడ్డు ఎక్కే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించండి. 

Also Read: The Pope Benedict XVI Passed Away:విషాదంలో కాథలిక్కులు.. 95 ఏళ్ల వయసులో మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత  

Also Read: Rishabh Pant's Money Looted: యాక్సిడెంట్ అయి పడి ఉంటే రిషబ్ పంత్ డబ్బు లూటీ చేశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News