The Pope Benedict XVI Passed Away:విషాదంలో కాథలిక్కులు.. 95 ఏళ్ల వయసులో మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత

The Pope Emeritus Benedict XVI Passed Away : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్కులు అందరూ విషాదంలో మునిగిపోయారు, 95 ఏళ్ల వయసులో మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 31, 2022, 05:33 PM IST
The Pope Benedict XVI Passed Away:విషాదంలో కాథలిక్కులు.. 95 ఏళ్ల వయసులో మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత

The Pope Emeritus Benedict XVI Passed Away: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ పోప్ ఎమిరిటస్ బెనెడిక్ట్ XVI ఈరోజు కన్ను మూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. ఇక ఆయన మరణానికి సంబంధించిన అధికారిక సమాచారం వాటికన్ సిటీ నుంచి వెలువడింది. మాజీ పోప్ ఎమెరిటస్ గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు . కాథలిక్ క్రైస్తవులు అందరూ తమ చీఫ్ గా పోప్ ను భావిస్తారు.

ఇక ప్రస్తుత  పోప్ ఫ్రాన్సిస్ బుధవారం తన అనుచరులందరినీ మాజీ పోప్ కోసం ప్రార్థించమని విజ్ఞప్తి చేశారు. అలా చేయడం వలన దేవుడు ఆయన జీవితంలోని చివరి రోజులలో అతనికి ఓదార్పునిస్తారని ఆయన వెల్లడించారు. ఇక మాజీ పోప్ బెనెడిక్ట్ 600 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా 2013లో పదవీ విరమణ చేశారు. ఆయన తరువాత పోప్ ఫ్రాన్సిస్ బాధ్యతలు తీసుకున్నారు.

ఇక పోప్ బెనెడిక్ట్ వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో మరణించారు. ఆయన రాజీనామా చేసినప్పటి నుండి అక్కడే నివసిస్తున్నారు. ఆయన 2005 నుండి 2013 వరకు అపోస్టోలిక్ సీగా ఉన్నాడు. 2013 సంవత్సరంలో, అతను కొన్ని కారణాల వల్ల పోప్ పదవిని వదులుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. పోప్ పదవి వదులుకున్న తరువాత వాటికన్ గార్డెన్స్‌లోని ఒక చిన్న ఎక్సెల్లియా ఆశ్రమంలో నివసించడం ప్రారంభించారు.

పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ XVI ఈరోజు ఉదయం 9:34 గంటలకు వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో తుదిశ్వాస విడిచారని బాధతో తెలియజేస్తున్నానని వాటికన్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పోప్  బెనెడిక్ట్ గత 1,000 సంవత్సరాలలో మొదటి జర్మన్ పోప్. ఇక మాజీ పోప్ తన వారసుడు పోప్ ఫ్రాన్సిస్‌తో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. 

Also Read: Tunisha Sharma Case: తునీషా మతం మార్చమని బలవంతం చేసిన షీజన్..మరో సీక్రెట్ లవర్ కూడా?

Also Read: Urfi Javed Sizzling Dress: ఉర్ఫీ జావేద్ గోళ్ల డ్రెస్ కూడా రెడీ చేస్తారా.. ఇదేందయ్యా ఇదీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News