Hyderabad Thub 2: తెలంగాణల సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2ను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఇందు కోసం ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. టీ హబ్-2 ప్రారంభోత్సవంపై ట్వీట్ చేసిన కేటీఆర్.. ప్రాజెక్ట్ గొప్పతనాన్ని వివరించారు. టీ హబ్-2 హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టానికి ఊతమిస్తుందని చెప్పారు. టీహబ్-2ను రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒకేసారి 2 వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మించారు. టీహబ్2 ప్రారంభోత్సవానికి దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇన్నోవేషన్ సదస్సు జరగనుంది. ఐటీ, స్టార్టప్ రంగ నిపుణులు, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో ప్రసంగిస్తారు.
టీహబ్ 2 ప్రారంభోత్సవంపై కేటీఆర్ చేసిన ట్వీట్ కు సినీ, క్రీడా రాజకీయ ప్రముఖులు స్పందించారు. తెలంగాణ సర్కార్ ను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. ‘వావ్.. కేటీఆర్ ఇది చూసి ఒక్కసారిగా స్టక్ అయిపోయా. భవిష్యత్తు నిజంగా అద్భుతంగా ఉంటుంది. భారతదేశంలో ఆవిష్కరణను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టిన మీకు అభినందనలు’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ ట్వీట్ చేశారు.
Wow!!! Absolutely stoked to see this @KTRTRS !!! The future looks AMAZING indeed and kudos to you for continuing to up the focus on innovation in India. Congrats!!! @THubHyd @nasscom https://t.co/bVogAEEuXU
— debjani ghosh (@debjani_ghosh_) June 26, 2022
‘భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు ఇది చాలా గొప్ప చొరవ’ అని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు.
This is a great initiative - forward and onwards into the future! 👏👏👏@KTRTRS https://t.co/YXazQdxHce
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 26, 2022
టీహబ్ 2 నిర్మాణం అద్భుతం.. తెలంగాణ భవిష్యత్ కు రోల్ మోడల్ అని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్ పై హీరో మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ టెక్ ఎకోసిస్టమ్‌కు భారీ ముందడుగు.. చాలా గర్వంగా ఉంది.. టీహబ్ హైదరాబాద్ ప్రారంభోత్సవానికి ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ ప్రిన్స్ ట్వీట్ చేశారు.
A massive step forward for Hyderabad's tech ecosystem! So proud @KTRTRS! All the very best for the launch of @THubHyd! https://t.co/sgOkcTeVKy
— Mahesh Babu (@urstrulyMahesh) June 26, 2022
హ్యాపెనింగ్ హైదారాబాద్.. చాలా గర్వంగా ఉంది అంటూ కేటీఆర్ ను అభినందిస్తూ సినీ నటి సమంత ట్వీట్ చేశారు.
#HappeningHyderabad
So proud 🙏@KTRTRS https://t.co/8i3U5G8jR9— Samantha (@Samanthaprabhu2) June 26, 2022
టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, అడవిశేష్, ప్రకాశ్‌రాజ్, సందీప్ కిషన్, సానియామీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు, గగన్ నారంగ్, పారుపల్లి కశ్యప్ వంటి సెలబ్రెటీలు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. టీహబ్ 2 ప్రారంభోత్సవాన్ని వెల్ కం చెబుతూ నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.
Read also: Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వీడిన ఉత్కంఠ..28న ఫలితాలు..!
Read also: Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..ఏ ఏ ప్రాంతాల్లో అంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి