Telangana: చేతకాదని రేవంత్‌ వైదొలిగితే ముఖ్యమంత్రిగా నేనేంటో చూపిస్తా: హరీశ్ రావు సవాల్‌

Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్‌ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్‌ విసరగా.. ఆ సవాల్‌ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్‌ విసిరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 14, 2024, 10:21 PM IST
Telangana: చేతకాదని రేవంత్‌ వైదొలిగితే ముఖ్యమంత్రిగా నేనేంటో చూపిస్తా: హరీశ్ రావు సవాల్‌

Harish Rao Vs Revanth: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో అసలు చర్చను పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టుల అంశంపై చర్చ నిర్వహించడంతో రాజకీయ విమర్శలు జరుగుతున్నాయి. బుధవారం కూడా అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాళేశ్వరం చర్చలో రేవంత్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి సవాల్‌ విసిరారు. 'సీఎంగా నువ్వు అవ్‌. కాళేశ్వరంలో ఎట్ల నీళ్లు పారించు' అని మాట్లాడారు. ఈ సవాల్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించారు. 'నీకు చెయ్య చాతగాకపోతే. నాకు చాతకాదు అని ఒప్పుకొని తప్పుకో. రేవంత్‌ రెడ్డి రాజీనామా చేస్తే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తా. అనంతరం కాళేశ్వరం నీళ్లు ఎలా పారిస్తానో చూడు' అని సవాల్‌ విసిరారు. కాళేశ్వరంలో మేడిగడ్డ బేరాజ్‌లో పిల్లర్లు కుంగిపోయినా నీళ్లు పారించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారని, కానీ రేవంత్‌ రెడ్డికి తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Assembly: అసెంబ్లీలో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రోడ్డుపై ధర్నా

అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మీడియా పాయింట్‌లో మాట్లాడనివ్వకపోవడంతో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో హరీశ్‌ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. అతడి వ్యవహార శైలిని తప్పుబట్టారు. తెలంగాణలో దయనీయ పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో హరీశ్ రావు మాటలు ఇలా.. 'తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. వాళ్లకు చేతకాకపోతే రేవంత్‌ రాజీనామా చేయాలి. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తా' అని తెలిపారు.

Also Read: Chalo Nalgonda: నల్లగొండ సభలో గర్జించిన కేసీఆర్‌.. తెలంగాణ కోసం పులిలా కొట్లాడుతానని వ్యాఖ్యలు

'కాళేశ్వరంలో ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఇంజనీర్లు కూడా చెబుతున్నారు. వాళ్లకు చేతకాకపోతే మాకు ప్రభుత్వాన్ని అప్పగించాలి' అని హరీశ్ రావు సవాల్‌ విసిరారు. 'ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తా. నాకు మద్దతు ఇస్తా అంటే నేను స్వీకరించడానికి సిద్ధమే. నాకు చేతకాదు హరీశ్‌ రావు నీవు చేయ్‌ అంటే చేసి చూపిస్తా' అని స్పష్టం చేశారు. ఇక రేవంత్‌ భాషపై స్పందిస్తూ.. 'ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నాం. మీరు బాగా చేస్తే ఆదరిస్తారు. లేదంటే బండకేసి కొడుతాడు. ఇప్పుడు సీఎంపై భాష గురించి మాట్లాడే రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ను కాల్చేయాలి.. ఉరితీయాలని మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. మరి అప్పుడలా ఆయన మాట్లాడొచ్చా అని నిలదీశారు.

'బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దానిపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో అనుమానాలు కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం నిలకడ మీద తెలుస్తది. మేం రిజర్వాయర్లు నింపి పెట్టడంతోనే యాసంగికి నీళ్లు పోతున్నాయి. ఇబ్బందేమీ లేదు. వచ్చే యాసింగికి నీళ్లు రాలేదనుకో. కేసీఆర్‌ ఉన్నప్పుడు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు వస్తలేవని ప్రజలు ఆలోచించరా' అని హరీశ్‌ రావు తెలిపారు. రైతులకు సరిపడా నీళ్లు ఇవ్వండని మరోసారి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీశ్ రావు చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News