/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Extreme Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకా విషమించనుందని వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో అసాధారణ వర్షపాతం నమోదు కానుందనే హెచ్చరిక కలవరం రేపుతోంది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో ఆ ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడుతోంది. నిన్నటి నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా రేపటిలోగా తెలంగాణలో అసాధారణ వర్షపాతం 24 సెంటీమీటర్ల వరకూ పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీనికితోడు తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏయే జిల్లాల్లో ఎలా ఉండనుందో వివరించింది. 

మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్,, మేడ్చల్ మల్కాజ్‌గిరి, అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. ఇక జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఈదులు గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయని తెలుస్తోంది. 

వాయుగుండంగా మారిన అల్పపీడనం ఇవాళ్టి నుంచి బలహీనపడవచ్చు. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రదేశ్ వద్ద కొనసాగుతోంది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం ఇప్పటికే కొనసాగుతోంది. ఇక నైరుతి రుతువపనాలు బికానర్, కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిశ్సా పరిసరాల్లో కేంద్రీకృతమే ఉత్తరాంధ్రలో ఏర్పడిన అల్పపీడనం మీదుగా విస్తరించి ఉంది. 

Also read: Heavy Rains: భారీ వర్షాలతో కాజీపేట రైల్వే స్టేషన్‌లో వరద నీరు, పలు రైళ్లు రద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
IMD Issues another serious warnign to telangana amid extreme heavy rains with abnormal rainfall of 24 cm, alerts public to be carefull
News Source: 
Home Title: 

Extreme Rains Alert: తెలంగాణలో మరో వార్నింగ్, అసాధారణ వర్షపాతం, తస్మాత్ జాగ్రత్త

Extreme Rains Alert: తెలంగాణలో మరో వార్నింగ్, అసాధారణ వర్షపాతం, తస్మాత్ జాగ్రత్త
Caption: 
Heavy Rainfall ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Extreme Rains Alert: తెలంగాణలో మరో వార్నింగ్, అసాధారణ వర్షపాతం, తస్మాత్ జాగ్రత్త
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, July 27, 2023 - 17:44
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
46
Is Breaking News: 
No
Word Count: 
244