Heavy Rains: భారీ వర్షాలతో కాజీపేట రైల్వే స్టేషన్‌లో వరద నీరు, పలు రైళ్లు రద్దు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రహదారులు జలదిగ్భంధనంలో చిక్కుకుని రాకపోకలు స్థంబించగా..ఇప్పుడు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 27, 2023, 05:08 PM IST
Heavy Rains: భారీ వర్షాలతో కాజీపేట రైల్వే స్టేషన్‌లో వరద నీరు, పలు రైళ్లు రద్దు

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి తీవ్ర వర్షాలు కూడా పడుతుండటంతో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోంది. కొన్ని రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై, రహదార్లపై నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఆగిపోతున్నాయి. తాజాగా హసన్‌పర్తి-కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వరంగల్ రైల్వే స్టేషన్‌లో వరద నీరు నిండుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగదా కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ బట్టల బజార్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. హన్మకొండ-వరంగల్ రహదారి బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోయింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి మొత్తం నీటిలోనే చిక్కుుకుని ఉంది. 

దాంతో దక్షిణ మధ్య రైల్వే మూడు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరో 9 రైళ్లను దారి మళ్లించింది. భారీ వర్షాల కారణంగదా రద్దు చేసిన రైళ్లలో నెంబర్ 17012 సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్, నెంబర్ 17233 సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, నెంబర్ 17234 సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ రైళు ఉన్నాయి. ఇక రైలు నెంబర్ 12761 తిరుపతి-కరీంనగర్, 12762 కరీంనగర్-తిరుపతి,  12757 సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, 12758 సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.

Also read: Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు అతి భారీ వర్షాలు, ఆగస్టు 2న మరో అల్పపీడనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News