బాబ్రీని కూల్చిన వారిని జైలుకు పంపాలి: అక్బరుద్దీన్ ఒవైసీ

బాబ్రీ మసీదు అంశంపై ఎంఐఎం పార్టీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన వారందరినీ జైలుకు పంపించాలని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

Last Updated : Dec 3, 2019, 11:45 PM IST
బాబ్రీని కూల్చిన వారిని జైలుకు పంపాలి: అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ బాబ్రీ మసీదు అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన వారందరినీ జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. మసీదు కూల్చివేత ఘటనపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి, మసీదు కూల్చివేతకు బాధ్యులైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయోధ్య స్థల వివాదం అంశంపై సుప్రీంకోర్టు తీర్పులను సమీక్షించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఒవైసి చెప్పారు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు కావడంతో ఆ రోజును బ్లాక్ డేగా పాటించనున్న నేపథ్యంలో మెహిదీపట్నంలో ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసి ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయోధ్యలో మసీదు నిర్మాణానికి వేరే చోట ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలనే సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని కోరుతూ డిసెంబర్ 6న ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలని ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు.

Trending News