తెలంగాణలో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన పవన్ కల్యాణ్.. కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం నింపేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
జనసేన పార్టీ చీఫ్ ఆదేశాలతో స్థానిక పోరులో జనసేన అభ్యర్ధులు రంగంలోకి దిగుతున్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థుల్ని ఎంపికచేసే పనిలో ఉంది. తెలంగాణవ్యాప్తంగా కసరత్తును మొదలు పెట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం జనసేన పార్టీకి ZPTC అభ్యర్ధులకు యుథాతథంగా గ్లాసు గుర్తు కేటాంచగా..MPTC అభ్యర్ధులకు మాత్రం బ్యాట్ గుర్తు కేటాయించింది. MPTC లో గ్లాస్ గుర్తు లేనందున బ్యాట్ గుర్తు కేటాయించడం జరిగిందని జనసేన పార్టీ విరణ ఇచ్చింది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తులు
ZPTC : Glass Tumbler ( గాజు గ్లాసు)
MPTC : Bat (బ్యాట్)
Note : MPTC లో గ్లాస్ గుర్తు లేనందున బ్యాట్ గుర్తు కేటాయించడం జరిగింది. pic.twitter.com/GXH0e8MK9F
— JanaSena Party (@JanaSenaParty) April 24, 2019
ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ప్రత్యేకించిన స్వేచ్చా చిహ్నాల నుండి తమ అభ్యర్థులందరికీ ఒకే గుర్తును ఇవ్వాలని ఆయా పార్టీలు కోరుతుంటాయి. ఇలా జనసేన, తెలంగాణ జనసమితి, సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీలు కోరాయి. దీంతో ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది.