Job Notification : వయసుతో సంబంధం లేదు.. కానీ ఐఐటి హైదరాబాదులో లక్షల్లో జీతం..

IIT Hyderabad : తెలంగాణ సంగారెడ్డి జిల్లా కంది లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగాల భర్తీ కి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వయసుతో సంబంధం లేకుండా లక్షలలో జీతం ఇస్తున్న జాబ్ ఇదే.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 09:33 PM IST
Job Notification : వయసుతో సంబంధం లేదు.. కానీ ఐఐటి హైదరాబాదులో లక్షల్లో జీతం..

IIT Hyderabad : మరి కొన్నాళ్ళ లో చదువు పూర్తి కావస్తుంది అనగానే ప్రతి విద్యార్థికి గుర్తు వచ్చేది మంచి జాబ్ కోసం ఎలా వెతుక్కోవాలి అని మాత్రమే. కానీ ఇప్పటికీ ఎంతోమంది చదువు పూర్తయ్యాక ఇంకా నిరుద్యోగంతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా ఇప్పుడు ఉద్యోగం లేక సతమతం అవుతున్నారు. కానీ ఇప్పుడు నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్.

తాజాగా ఇప్పుడు టాలెంట్ ఉన్న అలాంటి నిరుద్యోగుల కోసం సంగారెడ్డి జిల్లా కంది లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటి హైదరాబాద్) ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను చేపడుతోంది.

ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరి అభ్యర్థులను కోసం ఐఐటి హైదరాబాద్ వారు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు https://www.iith.ac.in/careers/ అనే వెబ్సైట్ లో మనకి దొరుకుతాయి. ఈ వెబ్సైట్ లో ఆయా ఉద్యోగాల కి సంబంధించిన ప్రమాణాలు చూసి అప్లై చేసుకోగలరు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్‌ మేనేజ్‌మెంట్, లిబరల్ ఆర్ట్స్, కెమికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్‌ మెటలర్జికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, డిజైన్ అండ్‌ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, డిజైన్ ఇతరత్రా విభాగాల్లో ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్ వారు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

దీనికోసం సంబంధిత విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న వారి కోసం వెతుకుతున్నారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 35 ఏళ్ల వయోపరిమితి ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్ కి 45 ఏళ్లు, ప్రొఫెసర్ కి 55 ఏళ్లు వయోపరిమితి ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ జీతం నెలకి 98,200 నుంచి 1,01,500 దాకా ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్ కి 1,39,600 నెల జీతం కాగా ప్రొఫెసర్ కి నెలకి 1,59,100 జీతం లభిస్తుంది. 

ఇక నవంబర్ 13 లోగా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ డ్రైవ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెబ్ సైట్ లో మనకి అందుబాటులో ఉంటాయి.

 

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News