KCR Became Sick at Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వల్ప అస్వస్థత గురైనట్లుగా తెలుస్తోంది. ఆయన కొద్ది రోజుల క్రితం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లారు. అటు నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన అప్పటి నుంచి తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలో ఉంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేసీఆర్ దాదాపు మూడు రోజుల నుంచి అస్వస్థతతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో తన నివాసానికే వైద్యులను పిలిపించుకుని కేసీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. అనారోగ్యం రీత్యా ఆయన మరో రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోని ఉండాల్సి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని కేసీఆర్ ఆదేశించడంతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐ అండ్ పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు స్పెషల్ ఫ్లైట్ లో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో రాష్ట్ర అధికారులతో పాలనాపరమైన అంశాల మీద కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తెలంగాణకు రావాల్సిన నిధులపై సమాచారం తీసుకుని అస్వస్థత తగ్గిన తర్వాత కేంద్ర పెద్దలను కలిసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక సుమారు వారం రోజుల నుంచి కేసీఆర్ ఢిల్లీలో ఉండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఇంకా ఎన్ని రోజులు ఢిల్లీలో ఉంటారు? ఎప్పుడు హైదరాబాద్ వస్తారు? అనే విషయం మీద కూడా టీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది.
ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడ టిఆర్ఎస్ పార్టీ కోసం లీజుకు తీసుకున్న ఒక భవనానికి సంబంధించిన మరమ్మత్తు పనులు పరిశీలించారని అలాగే ఢిల్లీలో పార్టీ కోసం కొత్తగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన ఏదైనా చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: AICC President Election: గాంధీ భవన్ లో 45 ఇండస్ట్రీ లీడర్ గోల... అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రచ్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook