స్నేహానికి అర్థం చెప్పిన కేసీఆర్

హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ఏరియా గాంధీనగర్‌ నివాసైన కేసీఆర్ బాల్యమిత్రుడు కె. రాజేంద్రప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ తన బాగోగులు అడిగి తెలుసుకున్నారట

Last Updated : Nov 25, 2017, 06:42 PM IST
స్నేహానికి అర్థం చెప్పిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాల్యమిత్రుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారట. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ఏరియా గాంధీనగర్‌ నివాసైన కె. రాజేంద్రప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ తన బాగోగులు అడిగి తెలుసుకున్నారట. అలాగే ఆయనతో కొద్ది సేపు గడిపి పాత విషయాలను నెమరువేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ కూడా కొన్నాళ్లు రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తే. గతంలో రేపల్లె నియోజకవర్గం నుండి ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేశారు. ఆయనకు కేసీఆర్‌తో చిన్నప్పటి నుండీ పరిచయం. వారిద్దరు మంచి స్నేహితులని పలువురు తెలిపారు. కేసీఆర్ గతంలో కూడా ఊహించని సందర్భాల్లో తన స్నేహితులను కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్  బాల్యమిత్రుడైన వెంకటేశం అనే అతను, సీఎంని కలవడానికి ప్రగతి భవన్‌కు వస్తే, ఆయనను ఆప్యాయంగా కౌగలించుకొని మాట్లాడారట కేసీఆర్.  అలాగే ఓ సారి సిద్ధిపేట వెళ్తున్నప్పుడు రోడ్డు మీద తన బాల్యమిత్రులు కనిపిస్తే.. కారు ఆపించి మరీ వారిని ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లారు కేసీఆర్. 

Trending News