టీఆర్ఎస్‌లో అందరి చెవులు చెవిటివయ్యాయి: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

టీఆర్ఎస్‌లో అందరి చెవులు చెవిటివయ్యాయి: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Last Updated : Oct 16, 2019, 11:33 AM IST
టీఆర్ఎస్‌లో అందరి చెవులు చెవిటివయ్యాయి: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ధోరణి చూస్తోంటే.. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక్కటీ తన పక్కనుంటే చాలని అనుకుంటున్నారు అనిపిస్తోందని చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు రవాణా శాఖ, ఆరోగ్య శాఖలు అక్కర్లేదని భావిస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్‌లో అందరి చెవులు చెవిటివి అయిపోయాయని ఎద్దేవా చేసిన కొండా... కేవలం కేకే గారు ఒక్కరు వినే వ్యక్తి అని అనిపించే ఆయన్ని కలిసి చర్చించడానికి వచ్చాను. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది కేవలం కార్మికులకో, లేక ప్రజలకో నష్టమని కాకుండా అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోతాయని.. నష్టపోయేవారిలో కేసీఆర్, టీఆర్ఎస్ కూడా ఉంటాయనే విషయాన్ని ముఖ్యమంత్రే గ్రహిస్తే బాగుంటుందని అన్నారు. కేకేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆర్టీసి కార్మికుల సమస్యను పరిష్కరిస్తే, టీఆర్ఎస్‌కే లాభం జరుగుతుందని తెలుసు. అయినా సరే రాజకీయ లబ్ధిని పక్కకుపెట్టి ఆలోచించాల్సిన సమయం ఇది అనిపించే తాను కేకేను కలవడానికి వచ్చానని కొండా తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి నిద్రలోంచి లేపాలా ? లేక వారికి కళ్లు కనపడతలేవా అర్థం కావడం లేదని కొండా విస్మయం వ్యక్తంచేశారు. పోలీసులు తన పక్కనుంటే చాలని కేసీఆర్ అనుకుంటున్నారేమో కానీ అలా వెనకటికి దొరల పాలన నడిచినట్టు ఇప్పుడు నడవదు అని హితవు పలికారు.

Trending News