Koppula Harishwar Reddy: మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల ఇక లేరు.. పరిగి ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం

Koppula Harishwar Reddy Passes Away: బీఅర్ఎస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 

Written by - Pavan | Last Updated : Sep 23, 2023, 07:03 AM IST
Koppula Harishwar Reddy: మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల ఇక లేరు.. పరిగి ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం

Koppula Harishwar Reddy Passes Away: బీఅర్ఎస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్వర్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల మహేష్ రెడ్డి ఆయన కుమారుడే. బీఅర్ఎస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్.. జనంలో ఆధరణ పొందిన సీనియర్ రాజకీయ నాయకులుగా, డిప్యూటీ స్పీకర్ గా ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు మహేష్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రాష్ట్ర విభజనకు ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిగి నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల హరీశ్వర్ రెడ్డి.. 1999 - 2003 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో డిప్యూటీ స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. టీడీపీలో ఉన్నప్పటి నుండే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న హరీశ్వర్ రెడ్డి... రాష్ట్ర విభజన అనంతరం 2014 లో సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఇది కూడా చదవండి : Telangana Assembly: అక్టోబర్‌లో రెండ్రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు..

పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డితో కలిసి పనిచేసే క్రమంలో ఆయనకు తనకు ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.  

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News