Latest Weather report: తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు..!

Weather Updates: తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2022, 03:53 PM IST
Latest Weather report: తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు..!

Telangana Rain updates: ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా రేపు, ఎల్లుండి కూడా ఇదే విధంగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. నిన్న ఆగ్నేయ మధ్యప్రదేశ్ వద్ద ఉన్న ఉత్తర దక్షిణ ద్రోని ఈరోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఇంటీరియర్ తమిళనాడు మీదగా కొమరిన్ ప్రదేశం వరకు కొనసాగుతూ సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ వద్ద ఏర్పడింది. దీని ప్రభావంతో  సెప్టెంబర్ 07న తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. 

అంతేకాకుండా వచ్చే 48 గంట్లలో బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రాబోయే మూడు రోజులపాటు తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy rains in Telangana) అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ వైపు ఎండలు..మరోవైపు వానలు దంచి కొడుతున్నాయి. ఉదయం భానుడి ఉక్కపోతతో అల్లాడుతున్న జనం...సాయంత్రం వరుణుడి రాకతో సేదతీరుతున్నారు. నిన్నటి నుంచి ఏపీలో పరిస్థితి ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ.. బీజేపీ ఎల్పీ నేత ఎవరో? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News