మళ్లీ ప్రజలు దీవిస్తే.. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను సాధిస్తా: కేసీఆర్

ఇవాళ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ప్రగతి నివేదన సభ'ను నిర్వహిస్తోంది.

Last Updated : Sep 3, 2018, 11:26 AM IST
మళ్లీ ప్రజలు దీవిస్తే.. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను సాధిస్తా: కేసీఆర్
Live Blog

ఇవాళ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ప్రగతి నివేదన సభ'ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తికాగా.. ఈ బహిరంగ సభకు 25లక్షల మంది కార్యకర్తలు హాజరుకానున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ట్రాక్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. వేదికపై సీఎం కె.చంద్రశేఖర్ రావు, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు,  మాజీ మంత్రులు కూర్చోనున్నారు.

3 September, 2018

  • 19:50 PM

    ఏ గ్రామంలోకి వెళ్లినా.. టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. త్వరలో కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ వేస్తామని.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన పథకాలు అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. అలాగే ఎన్నికలకు ముందే కృష్ణా, గోదావరి నీళ్లు అందిస్తాం కేసీఆర్ తెలిపారు. అలాగే రాష్ట్ర ఆదాయం పెంచడానికి ప్రయత్నిస్తున్నామని కూడా కేసీఆర్ తెలిపారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఇసుక వల్ల వచ్చిన ఆదాయం రూ.9 కోట్లు అయితే.. టీఆర్ఎస్ హయాంలో అదే ఆదాయం రూ.1,980కోట్లు చేరుకుందని కేసీఆర్ తెలిపారు.  మళ్లీ తెలంగాణ ప్రజలు దీవిస్తే, అద్భుతమైన కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను సాధించడంతో పాటు సమూలంగా పేదరికాన్ని నిర్మూలించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడం, వీటన్నింటినీ భగవంతుడి దయ వల్ల సాధించి తీరుతానని అందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతున్నానని కేసీఆర్ తెలిపారు.

     

  • 19:02 PM

    కేసీఆర్ ప్రగతి నివేదన సభకు వచ్చిన వారికి శుభాభినందనలు తెలిపారు. ఈ సభను చూస్తుంటే 2001 నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని.. కరెంటు ఛార్జీలు పెంచినా రైతులు దిక్కులేని స్థితి ఉండేవారని.. అయినా అప్పటి ప్రభుత్వ అధికార మదాన్ని అణిచామని తెలిపారు. కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా తాను రాసిన లేఖతోనే ఉద్యమం మొదలైందని తెలిపారు. అంతకు ముందే కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. 

     

  • 18:35 PM

    ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు.. కేసీఆర్ ప్రారంభించిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా దళిత విద్యార్థి సంఘాలు ర్యాలీ

  • 18:32 PM

    ప్రగతి నివేదన సభ ప్రత్యక్ష ప్రసారం (టీఆర్ఎస్ అధికారిక ఫేస్ బుక్ పేజీ నుండి)

     

  • 18:18 PM

    టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభాస్థలికి చేరుకున్నారు. ఆయన సభా ప్రాంగణానికి చేేరుకోగానే సభకు వచ్చిన ప్రజలు ఉత్సాహంతో ఉరకలేశారు.

    కేసీఆర్ సభాస్థలికి

     

     

  • 18:04 PM

    కేసీఆర్ మరికాసేపట్లో కొంగరకలాన్‌లో జరగుతున్న ప్రగతి నివేదన సభకు చేరుకోనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఇంకా లక్షలాది మంది సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

     

    మరికాసేపట్లో హెలికాఫ్టర్ లో సభా ప్రాంగణానికి చేరుకోనున్న కేసీఆర్

  • 17:59 PM

    'ప్రగతి నివేదిక సభ' వేదిక. ఈ వేదికపై నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. 

     

  • 17:57 PM

    ఈ బహిరంగ సభను ప్రజలు చాలా కాలం గుర్తు పెట్టుకుంటారు. ఇది దేశంలో అతిపెద్ద రాజకీయ ర్యాలీ:  తెలంగాణ మంత్రి కేటీఆర్

     

  • 17:55 PM

    ప్రగతి నివేదన సభ వద్ద శ్రీరాముడి వేషధారణలో సీఎం కేసీఆర్ ప్లెక్సీ

     

  • 17:53 PM

    ప్రగతి నివేదన సభకు తరలివస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు

     

Trending News