Add Zee Business As A Preferred Source
App
Live Now

TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు వీరే..!

TS EAPCET 2024 Results Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తెలంగాణ రిజల్ట్స్‌ను eamcet tsche ac in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి  
TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు వీరే..!
Image Credit: TS EAPCET 2024 Results Live Updates
18 May 2024 12:10 PM (IST)

TS EAMCET Result 2024 Live Updates: అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఉత్తీర్ణత శాతం ఇలా..

==> అబ్బాయిలు 88.25 శాతం 
==> అమ్మాయిలు 90.18 శాతం 
==> మొత్తం - 89.66 శాతం

18 May 2024 12:07 PM (IST)

TS EAMCET Result 2024 Live Updates: ఇంజనీరింగ్‌ పాస్ శాతం ఇలా..

==> అబ్బాయిలు - 74.38 శాతం
==> అమ్మాయిలు - 75.85 శాతం
==> మొత్తం ఉత్తీర్ణత శాతం - 74.98

18 May 2024 12:02 PM (IST)

TS EAMCET Result 2024 Live Updates: గత ఏడాదితో పోలిస్తే.. ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు తెలిపారు.

18 May 2024 11:59 AM (IST)

TS EAMCET 2024 Topers: అగ్రికల్చర్, ఫార్మసీలో చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ప్రణీత ఫస్ట్ ర్యాంక్ సాధించింది. సెకండ్ ర్యాంక్ రాధాకృష్ణ, థర్డ్ ర్యాంక్ శ్రీవర్షిణి, నాలుగో ర్యాంక్ రాఘవ్, ఐదో ర్యాంక్ సాయి వివేక్ సాధించారు.

18 May 2024 11:42 AM (IST)

TS EAMCET Result 2024 Live Updates: ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంక్ హర్ష, మూడో ర్యాంక్ రిషి శేఖర్ శుక్లా, నాలుగో ర్యాంక్ సందేశ్, ఐదో ర్యాంక్ యశ్వంత్ రెడ్డి, ఆరో ర్యాంక్ కుశాల్ కుమార్, ఏడో ర్యాంక్ విదీత్ సాధించారు.

18 May 2024 11:38 AM (IST)

TS EAMCET Result 2024 Live Updates: ఇంజినీరింగ్‌లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సత్యవాడ జ్యోతిరాదిత్యకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.

18 May 2024 11:33 AM (IST)

TS EAMCET Result 2024 Live Updates: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఏపీ విద్యార్థుల్లో 34 వేల మందికిపైగా క్వాలిఫై అయ్యారు.

18 May 2024 11:30 AM (IST)

TS EAMCET Result 2024 Live Updates: తెలంగాణ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలకు మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరిలో 2,40,617 మంది పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఫార్మసీ విభాగం పరీక్షలకు 1,00,432 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 91 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు.

18 May 2024 11:26 AM (IST)

TS EAMCET Result 2024 Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.

18 May 2024 11:15 AM (IST)

TS EAPCET 2024 Results Live Updates: TS EAPCET 2024 ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలకు 3 లక్షల 55 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

18 May 2024 11:13 AM (IST)

TS EAPCET 2024 Results Live Updates: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం TS EAPCET 2024 Results విడుదల చేయనున్నారు.

18 May 2024 11:09 AM (IST)

TS EAMCET Result 2024 Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు మీడియా సమావేశం ప్రారంభించారు.
 

18 May 2024 10:59 AM (IST)

TS EAPCET 2024 Results Check on eamcet.tsche.ac.in: ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

==> ముందుగా eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
==> TS EAPCET 2024 Results ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
==> TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
==> మీ రిజల్ట్స్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి

 

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.