Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..

Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 21, 2024, 01:43 PM IST
  • మాస్ డ్యాన్స్ తో అదరగొట్టిన మల్లారెడ్డి..
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Malla reddy Dance:  అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..

Malla reddy dance video: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తలోకి  నిలిచారు. ఆయన స్టేజీ మీద డ్యాన్స్ చేస్తు రెచ్చిపోయారు. మల్లారెడ్డి ఎప్పుడు చూసిన మాస్ ఫాలోయింగ్ తో డైలాగు లతో రచ్చ చేస్తుంటారు. పాలమ్మిన, పూలమ్మిన అంటూ ఆయన చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. తాజాగా, ఆయన మరోసారి డ్యాన్స్ చేస్తు రచ్చ చేశారు.

 

మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది. అందులో భాగంగానే వివాహానికి స్పెషల్ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలో భాగంగా ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాత్రి జరిగిన సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆయన అదిరిపోయే డ్రెస్ వేసుకుని, మాస్ స్టెప్పులు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. మల్లా రెడ్డి డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తు హల్ చల్ చేశారు. ఆయన పాటకు తగ్గట్టుగా ఫెక్స్ ఎక్స్ ప్రెషన్ ఇస్తు డ్యాన్స్ చేశారు. 

Read more: Viral Video: వామ్మో.. ప్రియుడితో గదిలో రాత్రి పూట యువతి.. సడెన్‌గా డోర్ తెరిచి చూడగానే.. వీడియో వైరల్..

ఆయన డ్యాన్స్ కు అక్కడున్న వారంత ఫిదా అవుతున్నట్లు తెలుస్తొంది. మరోవైపు ఆయన చేస్తున్న డ్యాన్స్ చూస్తే.. ఆయనకు ఇంకా వయసు ఏంకాలేదంటూ కూడా నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x