KTR on Chandrababu Naidu Arrest: తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత కూడా కొందరికి పాత అలవాట్లు పోత లేదని.. NDA తన DNAలో నరనరాన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోడీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో ప్రతీ సారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎందుకు విషం చిమ్ముతున్నారు..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో ప్రతీసారీ తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలకు కూడా పాతర వేశారని అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
"2014, 2018 లో పుట్టగతులు లేకుండా ఎలా పోయారో.. బీజేపీకి మళ్లీ అదే గతి పడుతుంది. మొన్ననే దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం.. రాష్ట్ర ఉత్సవాలు జరగలేదని ప్రధాని ఎలా అంటారు. అమరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారు. ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అత్యంత వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాకు మీరు ఏం చేశారు..? నీళ్లలో మా వాటా తేల్చాలని జూలై 14, 2014లో మా ముఖ్యమంత్రి మీకు దరఖాస్తు ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి లేదా కాళేశ్వరంలలో ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వాలని కోరాం. కర్ణాటకలో, ఆంధ్రలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. పాలమూరులో అడుగు పెట్టే ముందు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇచ్చాకే ప్రధాని రావాలి.
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం బీజేపీ. 2014 ఎన్నికల బహిరంగ సభల్లో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని మాటిచ్చారు. ఆ తరువాత వారే అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయడానికి కూడా ప్రధానికి తీరిక లేదా..? ఆగస్టు 10, 2015న సుప్రీంలో న్యాయ పోరాటం కూడా చేశాం. 2020 అక్టోబర్ 6న షేకావత్ మాతో కేసు ఉప సంహరించుకుంటే.. తేలుస్తామని నమ్మించారు. ఇప్పుడైనా పాప ప్రక్షాళన చేసుకొని.. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి.." అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఖాళీ చేతులతో వేస్తే.. ఓట్ల డబ్బాలు కూడా ఖాళీగానే ఉంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీలుగా ఇద్దరు నాయకుల పేర్లను క్యాబినెట్ నామినేట్ చేసిందని.. శ్రవణ్ ప్రొఫెసర్‌గా తెలంగాణ ఉద్యమంలో పని చేశారని గుర్తు చేశారు. జనరల్ నియోజక వర్గం నుంచి సత్యనారాయణ ట్రేడ్ యూనియన్లో గెలుపొందారని చెప్పారు. గవర్నర్ తాను స్వయానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అని.. సకారియయా కమీషన్ ప్రకారం ఎవరు అనర్హులు..? అని ప్రశ్నించారు. బలహీన వర్గాల నాయకులను చట్ట సభలకు తీసుకొస్తామని అంటే ఎందుకు ఒప్పుకోరు..? అని నిలదీశారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. రెండు పార్టీల మధ్య గొడవగా చూస్తున్నామన్నారు. తాము ఆ గొడవలో తల దూర్చమని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీల అంశంలా ఉందని.. తాను వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌కు మిత్రుడని అన్నారు. బాబు అంశం కోర్టులో ఉందని.. దీని గురించి మాకు అనవసరని వ్యాఖ్యానించారు. లోకేష్ తనకు కాల్ చేసి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని అడిగారని.. ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దని.. ఎవరికి అనుమతి ఇవ్వమని చెప్పానని తెలిపారు. ఇది రెండు రాజకీయ పార్టీల ఘర్షణ అని.. ప్రశాంతంగా ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దన్నారు.
Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి