హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో రాష్ట్రంలోని కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితరుల సమక్షంలో బుధవారం మంత్రి కేటీఆర్ తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల్లో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని అన్నారు. ఫలితంగా ఒకప్పుడు జీతాలే సరిగ్గా రావనే పేరు తెచ్చుకున్న హెచ్‌ఎండీఏలో... మంత్రి కేటీఆర్ రాకతో వార్షిక ఆదాయం రూ.13వేల కోట్లకు చేరినట్లు చిరంజీవి తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 1.74 వేల ఎల్‌ఆర్‌ఎస్‌లను 18 నెలల్లోనే పూర్తి చేశామని, త్వరలోనే లాండ్ పూలింగ్ విధానం ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకుంటామని హెచ్ఎండీఏ కమిషనర్ వివరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జలమండలి ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ రూ.3వేల కోట్లతో 9 మున్సిపాలిటీలకు శుద్ధమైన తాగు నీరు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. అలాగే రూ.3వేల కోట్లతో ఔటర్ చుట్టు రింగ్ మేయిన్‌ను వేయడంతోపాటు అందులో ఎప్పుడూ 20 టీఎంసీలు నిల్వ ఉండేటట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దాన కిషోర్ తెలిపారు.
కేటీఆర్ రాకతో మా ఆదాయం పెరిగింది