ప్రధాని మోదీ వ్యాఖలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండన

తెలంగాణ ఏర్పాటు పై ప్రధాని మోదీ భాద్యతా రాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ పర్యాటక, ఆబ్కారీ, సాంస్కృతిక, క్రీడల మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. భాధ్యత గల స్థానంలో ఉన్నానన్న విషయం ప్రధాని మోదీ గుర్తించుకోవాలని, రాజకీయాలకు లోక్ సభ వేధిక కాదని

Last Updated : Feb 6, 2020, 11:54 PM IST
ప్రధాని మోదీ వ్యాఖలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండన

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు పై ప్రధాని మోదీ భాద్యతా రాహిత్య వ్యాఖ్యలపై తెలంగాణ పర్యాటక, ఆబ్కారీ, సాంస్కృతిక, క్రీడల మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. భాధ్యత గల స్థానంలో ఉన్నానన్న విషయం ప్రధాని మోదీ గుర్తించుకోవాలని, రాజకీయాలకు లోక్ సభ వేధిక కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, కేసిఆర్ పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షను ప్రపంచమే గుర్తించిందని, ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కనిపించవని అన్నారు. తెలంగాణ బిజేపి నేతలు మోదీ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

పదవులు, అధికారం శాశ్వతం కాదని, చట్ట సభల్లో తానో బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నానన్న విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుంచుకుని మాట్లాడితే మంచిదని, తెలంగాణ ఉధ్యమం గురించి, ఇక్కడి ప్రజల ఆకాంక్ష గురించి ఏ మాత్రం తెలిసినా ఇలాంటి మాటలు మాట్లాడేవారు కాదని ఆయన అన్నారు. దేశ అత్యున్నత చట్టసభ లోక్ సభలో రాష్ట్ర విభజన సమగ్రంగా జరుగలేదు, అర్ధరాత్రి రాష్ట్రాన్ని విడగొట్టారని, తలుపులు మూసి తీర్మాణం చేసిందని ప్రధాని మోదీ మట్లాడడం దురదృష్టకరమన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News