Minister Srinivas Goud warns Pub Managements: హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో డ్రగ్స్ కారణంగా తొలి మరణం నమోదైన కొద్దిరోజులకే పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో రాష్ట్రంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు రాజకీయంగానూ అధికార, విపక్ష పార్టీల మధ్య దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని పబ్ యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రానికి చెడు పేరు వస్తుందంటే పబ్‌లను మూసివేయడానికైనా వెనుకాడేది లేదని పబ్ యాజమాన్యాలను హెచ్చరించారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లున్నా వదిలేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. ఆఖరికి సొంత పార్టీ వాళ్లున్నా సరే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చెందిన చాలా దేశాల్లో పబ్‌ల సంస్కృతి ఉందని... రాష్ట్రానికి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో పబ్‌లకు అనుమతినిచ్చామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అయితే పబ్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తే సహించేది లేదని... డ్రగ్స్ విక్రయించేవారికి తెలంగాణలో చోటు లేదని అన్నారు. నిబంధనలు పాటిస్తూ నిజాయితీగా వ్యవహరిస్తేనే పబ్‌లకు అనుమతిస్తామన్నారు.
ఇక నుంచి నగరంలో 61 పబ్‌లపై ప్రత్యేక నిఘా ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పబ్‌లో అన్నివైపులా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పబ్ కెమెరాలను పోలీసులకు అనుసంధానం చేయాలని... ఒకవేళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని పక్షంలో ఆ పబ్‌లను మూసివేయాలని అన్నారు. పబ్‌లో అశ్లీల, అసాంఘీక కార్యకలాపాలకు చోటు ఉండకూడదని.. ఒకవేళ అలాంటివి బయటపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై పబ్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎక్సైజ్ అధికారులదే బాధ్యత అని... పబ్‌లు, బార్లపై ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు.
Also Read: AR Rahaman Counter: అమిత్ షా 'హిందీ' కామెంట్స్‌పై ఏఆర్ రెహమాన్ గట్టి కౌంటర్...
Aadhar Download: మొబైల్ నంబరు లేకుండానే ఇకపై ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook