Dr. Preethi's Family: డా. ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటాం.. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

Ministers' console Dr. Preethi's Family: డా ప్రీతి ఆత్మహత్య వెనుక ఎవరున్నా.. దోషులు ఎవరైనా సరే, వారిని వదిలేది లేదు. దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తాం. అన్ని విధాలుగా అండగా ఉంటాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2023, 08:14 AM IST
Dr. Preethi's Family: డా. ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటాం.. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

Ministers' console Dr. Preethi's Family: జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామంలో డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. డా ప్రీతి చాలా ధైర్యవంతురాలు. ఇలా ఎందుకు చేసిందో, జరిగిందో తెలియడం లేదని అన్నారు. ఏదేమైనా ప్రీతి మృతి ఘటన అత్యంత బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది అని అన్నారు. 

డా ప్రీతి ఆత్మహత్య వెనుక ఎవరున్నా.. దోషులు ఎవరైనా సరే, వారిని వదిలేది లేదు. దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తాం. అన్ని విధాలుగా అండగా ఉంటాం.
అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రీతి ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయిస్తున్నారు. కారకులైన వారు ఎవరైనా సరే.. వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని స్పష్టంచేశారు. 

నా బిడ్డ పేరు కూడా ప్రీతినే. ప్రీతి కుటుంబాన్ని నా కుటుంబంగానే భావిస్తా. నేను ఈ కుటుంబానికి అండగా ఉంటాను అని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం తరపున పది లక్షలు ఆర్ధిక సహాయం ఇప్పించడంతో పాటు నేను, నా కార్యకర్తల నుండి కూడా మరో 20 లక్షలు ఇప్పిస్తా అని మంత్రి స్పష్టంచేశారు. అలాగే ప్రీతి కుటుంబంలో ఆమె సోదరుడు, సోదరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.  

ప్రీతి మృతి చెందడాన్ని కూడా ప్రతి పక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయి అని మండిపడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. శవాల మీద పేలాలు ఏరుకునే సంస్కృతి మంచిది కాదు అని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సానుభూతితో వ్యవహరించాలి. ఇంకా వీలైతే ప్రభుత్వం ఇంకా ఏమి చేస్తే బాగుంటుందో ప్రతిపక్షాలు సూచించాలి కానీ ఇలా రాజకీయం చేయడం తగదు అని ప్రతిపక్షాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసహనం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే మీరు ఏమి చేస్తున్నారో చెప్పండి కానీ ప్రీతి చావును రాజకీయం చేయకండి అని ప్రతిపక్ష నేతలను కోరారు. 

ప్రీతి మృతిపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ.. " ప్రీతి మృతి అత్యంత దురదృష్టకరం, బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రీతి ఘటన పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన విచారం వ్యక్తం చేశారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్.. ప్రీతి మృతి చెందిన బాధలో వారి కుటుంబ సభ్యులు ఉంటే.. ఇంకొందరు ఈ ఘటనను రాజకీయం చేయాలని చూడడం శోచనీయం అని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా నిరోధించాలో ఆలోచన చేయాలి తప్ప, రాజకీయం చేయడం సరికాదు అని హితవు పలికారు. ప్రీతిపై విష ప్రయోగం చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో ఎంతమేరకు నిజం ఉందనే విషయాన్ని రూడీ చేసుకునేందుకు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశారు. దోషులో ఎవరో తేలితే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.

ఇది కూడా చదవండి : Doctor Preethi Death: మృత్యువుకు తలవంచిన ప్రీతి.. విషాదంలో కుటుంబం, స్నేహితులు

ఇది కూడా చదవండి : Minister Harish Rao at NIMS: నిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News